Sharwa 37 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand). ఈ సినిమాల్లో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇవాళ సంయుక్తామీనన్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్.
ఇందులో దియా పాత్రలో నటిస్తున్నట్టు చెబుతూ.. సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్‌ను అందరితో పంచుకున్నారు మేకర్స్. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అద్భుతమైన ఫన్ రైడ్‌తో ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి.. అంటూ ఇప్పటికే ఏకే ఎంటర్టైన్మెంట్స్ షేర్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.
శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తుండగా.. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Introducing the stunning @iamsamyuktha_ as DIA in #Sharwa37 ❤️
Wishing a very happy birthday to the talented actress who is going to steal hearts with her performance ❤️🔥#HBDSamyuktha @ImSharwanand @sakshivaidya99 @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @Composer_Vishal… pic.twitter.com/7PzX1Rhtk5
— AK Entertainments (@AKentsOfficial) September 11, 2024
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?