ప్రభుత్వంపై అర్చక ఉద్యోగుల సమరభేరి.. ఉద్యోగులకు ఒకే వేతన విధానం అమలుచేయాలని డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష వీడాలని, ఒకే శాఖలో చేస్తున్న వారందరికి ఒకే వేతన విధానం అమలు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టాన్ని సవరించాలని కోరుతూ బుధవారం బోడుప్పల్‌లోని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టుశ్రీనివాసాచార్యులు అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యో గ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో అర్చక ఉద్యోగులు డిమాండ్ల సాధ న కోసం ప్రభుత్వంపై సమరభేరి మోగించారు.
- అధికారులకు రాజభోగాలు.. అర్చకులదేమో శ్రమ దోపిడీ అని జేఏసీ ఉద్యోగుల విమర్శలు
- బోడుప్పల్లో అర్చక ఉద్యోగ జేఏసీ సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష వీడాలని, ఒకే శాఖలో చేస్తున్న వారందరికి ఒకే వేతన విధానం అమలు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టాన్ని సవరించాలని కోరుతూ బుధవారం బోడుప్పల్‌లోని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టుశ్రీనివాసాచార్యులు అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్చక ఉద్యో గ జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో అర్చక ఉద్యోగులు డిమాండ్ల సాధ న కోసం ప్రభుత్వంపై సమరభేరి మోగించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు గంగు ఉపేంద్రశర్మ, డీవీఆర్‌శర్మ మాట్లాడుతూ దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ కార్యాలయ సిబ్బంది వరకు ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతుండగా, దైవసేవలో ఉన్న 40 శాతం మంది అర్చకులకు గ్రాంట్ ఇన్ఎయిడ్, అవుట్సోర్సింగ్ పేరిట చాలీచాలని వేతనాలు ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొందరు అర్చకులు రోజు గడవక దుర్భర జీవితాలు గడుపుతున్నారని, అదే సమయంలో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్‌లో రూ.236 కోట్ల నిధులపై వచ్చే వడ్డీ కూడా ప్రభుత్వ ఖజానాకే జమ చేయడమేంటని మండిపడ్డారు.
పండుగపూట పస్తులు
రాష్ట్రంలోని 686 దేవాలయాల నుంచి కోట్లాది రూపాయల కాంట్రిబ్యూషన్ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మరోవైపు.. వెరసీ నెలల తరబడి వేతనాలు అందక అర్చక కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులతో పాటు, నిలిచిపోయిన ఆలయాల కేటగిరీ, అందుకు తగిన కేడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించడంలో చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో అర్చక వెల్ఫేర్ ట్రస్ట్‌బోర్డు మెంబర్ శ్రావణకుమారాచార్యులు, ఉద్యోగసంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, భాస్కరభట్ట రామశర్మ, పరాశరం రవీంద్రాచారి, రాజేశ్వరశర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

