Kanchana 4 | హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కి.. సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రాంఛైజీల్లో ఒకటి కాంచన. టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) కాంపౌండ్ నుంచి ఈ ప్రాంఛైజీలో ఇప్పటికే మూడు పార్టులు రాగా.. ఇప్పుడు కాంచన 4 (Kanchana 4) కూడా రాబోతుందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కాంచన 4 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే చిత్రీకరణ షురూ కానుంది. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతున్న కథ చెప్పిన వెంటనే ఇంప్రెస్ అయిన బాలీవుడ్ భామ పూజా హెగ్డే ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించేందుకు ఒప్పుకుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. ఈ చిత్రాన్ని గోల్డ్ మైన్ ఫిలిమ్స్ తెరకెక్కించనుంది.
ఈ విషయమై నిర్మాత మనీశ్ షా మాట్లాడుతూ.. రాఘవా లారెన్స్ డైరెక్షన్‌తోపాటు నటించనున్నారు. స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. లారెన్స్ ముంబైలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉంది. చాలా మంది యాక్టర్లకు కథ చెప్పడం జరిగింది.. గ్రీన్ సిగ్నల్ రాగానే వారి వివరాలు వెల్లడిస్తాం. కాంచన 4 జనవరి లేదా ఫిబ్రవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నామని చెప్పారు.
Raghava Lawrence’s #Kanchana4 will be Produced by Goldmine films !!
The budget of the movie is said to be 100Crs 👀#PoojaHegde is in the final talks for one of the female lead ✨
Script work has been completed & movie will kick-start soon 🎥 pic.twitter.com/hqwkkpRek4— AmuthaBharathi (@CinemaWithAB) September 11, 2024
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు
Jason Sanjay | జేసన్ సంజయ్ డెబ్యూ సినిమా ఈ హీరోతోనేనట..!