Jason Sanjay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తమిళ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్ బ్యానర్లో మొదటి సినిమాకు సంతకం కూడా చేశాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
జేసన్ సంజయ్ డెబ్యూ సినిమాలో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కాగా ఇప్పుడు మరో యాక్టర్ పేరు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అతడెవరో కాదు.. ఇటీవలే ధనుష్‌తో కలిసి రాయన్‌లో మెరిసిన సందీప్ కిషన్ (Sundeep kishan). తాజా టాక్ ప్రకారం జేసన్ సంజయ్ డెబ్యూ సినిమాను సందీప్‌కిషన్‌తో ప్లాన్ చేస్తున్నాడట.
ఈ మూవీకి జేసన్ సంజయ్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడని ఇన్సైడ్ టాక్. మరి ఈ వార్తలు కూడా గాసిప్లాగే మిగిలిపోతాయా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. జేసన్ సంజయ్ లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశాడని తెలిసిందే. మరి ఈ స్టార్ కిడ్ తొలి సినిమా ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్