ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు
ఎర్రవల్లి మండ లం బీచుపల్లి విజయవర్ధనే ఆయిల్‌మిల్ ఆవరణలో రూ.50 కోట్లు వెచ్చించి ఆయిల్‌పాం గెలల క్రసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను పిచ్చిమొక్కలను తొలగించి భూమి చదును చేసే పనులను ఆయన జిల్లా ఉద్యావనశాఖ అధికారి అక్బర్‌తో కలిసి శుక్రవారం పర్యవేక్షించారు.
- రూ.50 కోట్లతో ఫ్యాక్టరీ
- అయిజ, ధరూర్‌లో ఆయిల్‌పాం గెలల నిల్వ కేంద్రాలు
ఇటిక్యాల, ఫిబ్రవరి 20 : ఎర్రవల్లి మండ లం బీచుపల్లి విజయవర్ధనే ఆయిల్‌మిల్ ఆవరణలో రూ.50 కోట్లతో ఆయిల్‌పాం గెలల క్రసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు గాను పిచ్చిమొక్కలను తొలగించి భూమి చదును చేసే పనులను ఆయన జిల్లా ఉద్యావనశాఖ అధికారి అక్బర్‌తో కలిసి శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ ఆయిల్‌ఫెడ్, రాష్ట్రప్రభుత్వంతో అన్ని అనుమతులు తీసుకొందన్నారు.
ముఖ్యంగా నీటి అవసరాని కోసం కృష్ణానది నుంచి ఫ్యాక్టరీకి వచ్చే పైప్‌లైన్ పనులకు అనుమతులు వచ్చాయన్నా రు. ఫ్యాక్టరీ ఏర్పాటులో భాగంగా సివిల్ పనులకు రూ.15 కోట్లు, మెకానికల్ పనులకు రూ.35కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే గతంలో ఫ్యాక్టరీ ఉన్న 11 భవనాల నాణ్యత పరీక్షలలో రిఫైనరీ భవనము మినహాయించి మిగిలిన భవనాల సామర్థ్యం బాగుందని టెక్నికల్ రిపోర్ట్ వచ్చిందన్నారు. బాగున్న వాటిని ఉపయోగంలోని తీసుకొంటామన్నారు.
ప్రస్తుతం రోజుకు 320 టన్ను ల గెలలను క్రసింగ్ చేసే మిషనరీతో ప్యాక్టరీ ఏర్పాటుకు పూనుకొన్నామని, పంటసాగు పెరిగి గెలలు ఎక్కువగా వస్తే ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచుకోవచ్చన్నారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగు పెంచేందకు కృషి చేస్తున్నామని రైతులు అపోహలు వీడి పంటసాగుకు ముం దుకు రావాలన్నారు. పంటసాగు చేపట్టిన రైతులకు సేవలందించేందకు గాను ఆయిల్‌మిల్ పరిధిలో రైతు సేవా కేంద్రం మంజూరయ్యిందన్నారు. ఈసేవా కేంద్రంలో పంటకు కావాల్సి హార్వెస్టింగ్, ఎరువులు అన్ని రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ఆయిల్‌పాం గెలల సేకరణ కేంద్రాలు అయిజ, ధరూర్‌లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆయిల్ మిల్ మేనేజర్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

