సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మించి ఐటీ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 44 లక్షలు బురిడీ కొట్టించారు. వనస్థలిపురానికి చెందిన బాధితుడితో సంధ్య అగర్వాల్ అనే పేరుతో వాట్సాప్‌లో సందేశం వచ్చింది. తాము క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నామని, బియాన్స్‌తో ఇంటిగ్రేటెడ్ అయిన కంపౌండ్స్. కో అనే వెబ్సైట్లోకి వెళ్లి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ట్రేడింగ్ చేయండని సూచన చేశారు.
ఆ తరువాత వాట్సాప్ కాల్ చేసి తాను అని మ్యాథ్సు సూచనలతో మూడేండ్లుగా క్రిప్టో ట్రేడింగ్ చేసున్నానంటూ తమకు వచ్చిన లాభాల స్క్రీన్‌షాట్స్ పంపించారు. ఈ క్రమంలో అకౌంట్ క్రియేట్ చేసుకొని మొదట రూ. 30 వేలు పెట్టుబడి పెట్టాడు. వాటిని యుఎస్డీటీలోకి మార్చారు. రెండు రోజుల్లో లాభం చూపించారు. దీంతో బాధితుడు దఫదఫాలుగా రూ.44,83,995 లక్షలు పెట్టుబడి పెట్టాడు. లాభాలు విత్ డ్రా చేసుకోవడానికి 20 శాతం చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు ఇదంతా మోసమని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.