IPL 2025 : ముంబై ఇండియన్స్ జట్టు వాంఖడేలో అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఐపీఎల్ 18వ సీజన్లో బోణీ కోసం ఎదురుచూస్తున్న ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)ను 16.2 ఓవర్లకే ఆలౌట్ చేసింది. అరంగేట్ర యువ పేసర్ అశ్వనీ కుమార్(4-24) విజృంభణతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. టాపార్డర్ విఫలం కాగా అంగ్క్రిష్ రఘువంశీ(26), రమన్‌దీప్ సింగ్(22)లు పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. శాంట్నర్ వేసిన 17వ ఓర్ రెండో బంతికి రమన్‌దీప్ ఔట్ కావడంతో.. కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను హడలెత్తించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు తీస్తూ కేకేఆర్‌పై ఒత్తిడి పెంచారు ముంబై బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ తన తొలి ఓవర్లోనే డేంజరస్ సునీల్ నరైన్(0)ను బౌల్డ్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ ఓవర్లో ఓపెనర్ క్వింటన్ డికాక్(1) వెనుదిరిగాడు. అక్కడితో కోల్‌కతా కష్టాలు పెరుగుతూ పోయాయి.
Innings Break!
A superb bowling display by the #MI bowlers to dismiss #KKR for 116 in 16.2 overs 🎯@mumbaiindians‘ chase on the other side ⏳
Scorecard ▶ https://t.co/iEwchzDRNM#MIvKKR pic.twitter.com/R5i58lKBXC
— IndianPremierLeague (@IPL) March 31, 2025
ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అశ్వనీ కుమార్(4-24) సంచలన బౌలింగ్ చేయడంతో కేకేఆర్ బ్యాటర్లు తడబడ్డారు. అజింక్యా రహానే(11) రింకూ సింగ్(17), ఇంప్యాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే(19), ఆండ్రూ రస్సెల్ వికెట్లు తీసి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. ఆఖర్లో రమన్‌దీప్ సింగ్(22 12 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. అయితే.. శాంట్నర్ వేసిన 17వ ఓర్ రెండో బంతికి రమన్‌దీప్ ఔట్ కావడంతో.. కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది.