IPL 2025 : వాంఖడేలో ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. క్రీజులో కుదరుకున్న అంగ్క్రిష్ రఘువంశీ(26)ని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. ఆ కాసేపటికే అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రింకూ సింగ్(17) భారీ షాట్ ఆడి నమదర్ ధిర్ చేతికి చిక్కాడు. దాంతో, కోల్‌కతా 74కే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంప్యాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే(19), ఆండ్రూ రస్సెల్ (0) క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లకు స్కోర్.. 80-7.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ సునీల్ నరైన్(0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న క్వింటన్ డికాక్(1)ను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే కెప్టెన్ అజింక్యా రహానే(11)ను అశ్వనీ కుమార్ బోల్తా కొట్టించాడు. 25కే మూడు కీలక వికెట్లు పడిన దశలో కుర్రాళ్లు అంగ్క్రిష్ రఘువంశీ(25), వెంటకేశల్ అయ్యర్(3)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ, చాహర్ మరోసారి తన పేస్ పవర్ చూపిస్తూ అయ్యర్‌ను ఔట్ చేసి డిఫెండింగ్ చాంపియన్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్.. 41-4.