సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 24, 2020 , 14:42:45

హైద‌రాబాద్ నుంచి సైకిల్‌పై ఢిల్లీకి.. అనిల్ కుమార్ రికార్డు

హైద‌రాబాద్ నుంచి సైకిల్‌పై ఢిల్లీకి.. అనిల్ కుమార్ రికార్డు

హైద‌రాబాద్‌: న‌గ‌రానికి చెందిన అనిల్ కుమార్ గౌడ్ కొత్త రికార్డు నెల‌కొల్పాడు.  హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు అత‌ను సైకిల్ తొక్కుతూ వెళ్లాడు. సుమారు 1550 కిలోమీట‌ర్లు అనిల్ సైకిల్‌పై టూర్ చేశాడు.  ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ల‌క్ష్యంగా అత‌ను సైక్లింగ్ చేశాడు.  కేవ‌లం ఏడు రోజుల్లోనే సైకిల్‌పై ఢిల్లీకి చేరుకున్న‌ట్లు అనిల్ చెప్పాడు. గ‌తంలో హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వ‌ర‌కు సుమారు 650 కిలోమీట‌ర్ల దూరం న‌డుచుకుంటూ వెళ్లిన‌ట్లు అత‌ను తెలిపాడు. వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఆ ఫీట్ నిర్వ‌హించిన‌ట్లు అత‌ను వెల్ల‌డించాడు.