ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ పై ఇపుడు ఎక్కడ చూసినా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో నేనున్నానంటూ వేలాది మందికి అండగా నిలిచి రియల్ హీరో అయిపోయాడు. అయితే కొంతమంది దర్శకనిర్మాతలు సోనూసూద్ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ను తమ సినిమాలకు వాడుకోవాలని చూస్తున్నారట.
అంతేకాదు సదరు నిర్మాతలు తమ సినిమాల్లో హీరోగా నటించాలని సోనూసూద్ ను కోరుతున్నారని టాలీవుడ్ లో జోరుగా టాక్ నడుస్తోంది. అయితే నిర్మాతల ఆలోచనను అంచనా వేసిన ఈ యాక్టర్ మాత్రం వారి ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. సోనూసూద్ కు ప్రస్తుతమున్న ఇమేజ్ను వాడుకొని హీరో పాత్రలు చేయడం ఇష్టం లేదట. కానీ తాను పోషిస్తున్న పాత్రలకు మాత్రం రెమ్యునరేషన్ భారీగానే అడుగుతున్నాడని టాక్.
ఇవి కూడా చదవండి..
చిరు వాయిస్ ఓవర్‌తో సన్ ఆఫ్ ఇండియా టీజర్
నా కొడుకు పెద్దవాడవుతున్నాడు.. నిహారిక పోస్ట్ వైరల్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్