మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమైన నిహారిక సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్ట్లు పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.
ఆ మధ్య ఆపిల్ ఫ్రై అంటూ కొత్త రకమైన పదార్థాన్ని వండారు నిహారిక. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలానే కొత్త గెటప్లోకి మారి ఆ పిక్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది తెగ వైరల్ అయింది. ఇక తాజాగా తన బర్త్డే సందర్భంగా భర్త ఇచ్చిన బజ్ అనే పెట్కు సంబంధించిన విషయాన్ని ఒకటి షేర్ చేసింది. మాకు ఏం తోచనప్పుడు చేతిలో చేయి వేసుకొని పడుకొంటామని చెప్పిన నిహారిక నా బేబి బాయ్ పెద్దగా అవుతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. నిహారిక పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.