సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 13, 2020 , 19:17:41

క్వారంటైన్‌లో అశ్విన్‌, ప్రీతీ వివాహ వార్షికోత్సవం

క్వారంటైన్‌లో అశ్విన్‌, ప్రీతీ  వివాహ వార్షికోత్సవం

సిడ్నీ:  రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.  జడేజా, పుజారా,  రహానె, అశ్విన్‌తో పాటు   కొంతమంది ఆటగాళ్లు తమ వెంట భార్య, పిల్లలను కూడా తీసుకెళ్లారు.   ఆటగాళ్లందరూ 14 రోజుల క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్‌ చేస్తారు.  టెస్టు టీమ్‌లో కీలక ఆటగాడైన అశ్విన్‌ శుక్రవారం తన భార్య ప్రీతీ నారాయణన్‌తో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాడు.

2011 నవంబర్‌ 13న   ప్రీతీని అశ్విన్‌ వివాహం చేసుకోగా వీరికి అఖీరా అశ్విన్‌, ఆధ్య అశ్విన్‌ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  ప్రస్తుతం ఈ జంట తప్పనిసరి నిర్బంధంలో ఉండగా తమ వార్షికోత్సవాన్ని కూడా క్వారంటైన్‌లో జరపుకున్నట్లు ప్రీతీ సోషల్‌మీడియాలో వెల్లడించింది.