అధినేత వస్తున్నారహో..
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు.
- నేడు కందనూలులో కార్నర్ మీటింగ్
- ప్రసంగించనున్న గులాబీ బాస్ కేసీఆర్
- బస్సు యాత్ర సక్సెస్‌కు ఏర్పాట్లు
- స్వచ్ఛందంగా తరలొచ్చేందుకు సిద్ధమైన ప్రజలు
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో కేసీఆర్ రాక సరికొత్త ఉత్సాహాన్ని నింపనున్నది. కాంగ్రెస్‌పై పెరిగిన వ్యతిరేకతతో ప్రజలు కేసీఆర్ యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.
నేడు గులాబీ దళపతి రాక..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం నా గర్కర్నూల్కు వస్తున్నారు. పార్లమెంట్ ఎ న్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఖరారు చే యగా ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇప్పటికే సమావేశా లు నిర్వహించి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ క్రమం లో స్వయంగా కేసీఆర్ నాగర్‌కర్నూల్‌కు రానుండడం పార్టీ గ్రామస్థాయి నాయకుల్లోనూ జోష్‌ను నింపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 420హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రూపాన్ని నాలుగు మాసాల్లోనే ప్రజలు గ్రహించారు. దీంతో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆ ర్ మద్దతుతో బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్‌ను స్వచ్ఛందంగా ఆదరిస్తున్నారు. మూడు రోజుల కిందట మిర్యాలగూడలో ప్రా రంభమైన బస్సు యాత్ర శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నది. శనివారం సాయంత్రం 6గంటల వరకు కేసీఆర్ కందనూలుకు రానున్నారు.
ఉయ్యాలవాడ నుంచి భారీ ఊరేగింపును నిర్వహించనుండగా.. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగించనుండగా.. నియోజకవ ర్గం నుంచి 50వేల మంది ప్రజలు వచ్చే అవకాశమున్నది. కేసీఆర్ నాగర్‌కర్నూల్ వస్తున్నారని తెలిసిన వెంటనే పార్టీ నాయకులు సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలు భారీగా తరలివచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్రజ ల్లో వ్యతిరేకత మొదలై బీఆర్ఎస్పై విశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చింది. ఈ నాలుగు మాసాల్లో నియోజకవర్గంలో ఎలాంటి అ భివృద్ధి జరుగకపోవడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నా రు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి, పదేండ్లపాటు అభివృద్ధి చేసిన కేసీఆర్ రాక కోసం కందనూలు ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

