IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు విజయానికి చేరువవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యమైనా భారత పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓలీ పోప్(24)ను ఆకాశ్ దీప్ క్లీన్‌బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌కు పెద్ద షాకిచ్చాడు. దాంతో, బజ్ బాల్ ఆటతో చెలరేగాలనుకున్న ఆతిథ్య జట్టు ఆత్మరక్షణలో పడింది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తెరిపినిచ్చాక ఆట మొదలైన కాసేపటికే ఆకాశ్ దీప్ వికెట్ అందించాడు. క్రీజులో పాతుకుపోవాలనుకున్న ఓలీ పోప్(24)ను క్లీన్‌బౌల్డ్ చేసి జోష్ నింపాడు. ఆ తర్వాతి ఓవర్లో హ్యారీ బ్రూక్(23)ను ఎల్బీగా వెనక్కి పంపిన ఆకాశ్ భారత్‌ను మరింత చేరువ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్ విజృంభణతో 83కే సగం వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. వెంట వెంటనే వికెట్లు పడడంతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(3), జేమీ స్మిత్(4)లు వికెట్ కాపాడుకునే పనిలో ఉన్నారు.
AKASH HAS HIS FOURTH!
Brook goes lbw for 23 – England five down! https://t.co/t4iTZ4bYn1 | #ENGvIND pic.twitter.com/qghZq5lkLV
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2025