Allu Arjun | అమెరికాలో వైభవంగా జరిగిన నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2025 ఉత్సవాలు తెలుగు సంస్కృతి, ఐక్యతకు అద్దం పట్టాయి. ఈ ఘనమైన వేడుకల్లో ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్, రాఘవేంద్రరావు, సుకుమార్, శ్రీలీల వేదికపై ప్రత్యక్షమై ప్రవాసాంధ్రులకు మధురానుభూతులు కలిగించారు. వేదికపైకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాగానే అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. తన మార్క్ స్టైల్లో “తెలుగు వారంటే ఫైర్ అనుకుంటారా? వైల్డ్ ఫైర్!” అంటూ ‘పుష్ప’ డైలాగ్ పలికి జనాన్ని ఉర్రూతలూగించారు. అంతేకాదు, “నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్!” అంటూ సరదాగా స్పందించారు.
అంతర్జాతీయ వేదికపై ఇంతమంది తెలుగు వారిని ఒకేచోట చూడడం హృదయాన్ని తాకుతుంది అని బన్నీ స్పష్టం చేశారు. మీరు విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు తనం పరిరక్షిస్తూ, భాషా సంప్రదాయాలను గౌరవిస్తూ అద్భుతంగా నిలబడుతున్నారు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. తెలుగోళ్లు ఎక్కడున్నా తగ్గరు!” అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.కె. రాఘవేంద్రరావు ఈ వేడుకలో పాల్గొని తన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల వంటి తన పరిచయం చేసిన నటులు ఈ వేదికపై నిలవడం గర్వంగా ఉందన్నారు.సుకుమార్‌ను ఉద్దేశిస్తూ .. “నాకు అడవి రాముడు హిట్ ఇచ్చింది, నీకు అడవి పుష్ప స్టార్ డైరెక్టర్‌గా నిలిపింది అని చమత్కిరించారు.
ఇక కుమార్ మాట్లాడుతూ, “నా కెరీర్‌కు మైలు రాయిగా నిలిచిన 1 నేనొక్కడినే చిత్రాన్ని ఆదరించిన అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మైత్రి మూవీ మేకర్స్ లాంటి గొప్ప నిర్మాణ సంస్థ అందించారంటే, ఇది తెలుగు సినిమా విజయయాత్రకు కారణం” అని అన్నారు.శ్రీలీల కూడా తన ఉత్సాహభరిత ప్రసంగంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విదేశాల్లోనూ ఈ స్థాయిలో అభిమానుల ఆదరణ చూసి అబ్బురపడిపోయినట్లు తెలిపింది.ఈ కార్యక్రమం కేవలం వినోదానికి మాత్రమే కాదు, తెలుగు సినిమాకు, ప్రవాసాంధ్రుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది. అమెరికాలోని తెలుగువారు తమ భాష, సంస్కృతి పట్ల చూపుతున్న నిబద్ధత, అనురాగం ఈ వేడుకల ద్వారా మరోసారి స్పష్టమైంది అని అన్నారు.