Virat Kohli: సఫారీ టూర్‌కు ముందే భారత్‌కు బిగ్ షాక్.. రన్ మిషీన్ లేకుండానే బరిలోకి దిగనున్న టీమిండియా
Virat Kohli: వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడం లేదు.
Virat Kohli: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు సిరీస్ ఆరంభానికి ముందే భారీ షాక్ తగిలింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడం లేదు. ఈ విషయాన్ని అతడే స్వయంగా బీసీసీఐకి తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనంలో పేర్కొంది. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి అతడు మరికొన్ని రోజులు విరామం తీసుకోనున్నాడని, అయితే టెస్టులకు మాత్రం తాను అందుబాటులో ఉంటానని ఆ కథనం సారాంశం.
వచ్చే నెల 10 నుంచి దక్షిణాఫ్రికాతో సటీ20 సిరీస్ మొదలుకావాల్సి ఉంది. ఈ టూర్లో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే టీ20లు, వన్డేలకు దూరమయ్యే కోహ్లీ.. డిసెంబర్ 26 నుంచి మొదలుకాబోయే టెస్టు సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నాడు.
Virat Kohli has informed BCCI that he will take break in the white ball series against South Africa.
– He will be back in the Test series against South Africa. (To Indian Express) pic.twitter.com/M9as0OeLd9
— CricketMAN2 (@ImTanujSingh) November 29, 2023
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తనకు మరికొన్ని రోజులు విరామం కావాలని అతడు (కోహ్లీ) బీసీసీఐని కోరాడు. దక్షిణాఫ్రికా టూర్లో వైట్ బాల్ క్రికెట్ సెలక్షన్స్‌కు దూరమైనా అతడు రెడ్ బాల్ క్రికెట్ వరకు అందుబాటులో ఉంటాడు.. అని తెలిపాడు. ఈ ఏడాది వెస్టిండీస్ పర్యటన నుంచి కోహ్లీ విరామం లేకుండా ఆడుతున్నాడు. ఈ ఆరు నెలల కాలంలోనే అతడు 15 వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు. ఇక ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో 11 మ్యాచ్‌లలో ఏకంగా 765 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇదిలాఉండగా సఫారీ టూర్లో పర్యటించబోయే భారత జట్టును వచ్చే వారం ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

