Driving Licence | ప్రైవేటు కేంద్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్.. జూన్ 1 నుంచి అమల్లోకి!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు.
- కేంద్రం కొత్త నిబంధనలు
Driving Licence | న్యూఢిల్లీ, మే 19: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
అన్ని సదుపాయాలూ ఉంటేనే..
ఫోర్ వీలర్ పరీక్ష నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్‌కు కచ్చితంగా 3 ఎకరాల స్థలం ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉండాలి. ట్రైనర్లు కచ్చితంగా హైస్కూల్ విద్యను పూర్తి చేసుకొని, డ్రైవింగ్‌లో ఐదేండ్లు అనుభవం పొంది ఉండాలి. వీరికి బయోమెట్రిక్స్, ఐటీపై ప్రాథమిక అవగాహన ఉండాలి. నిబంధనల ప్రకారం ఈ అన్ని అర్హతలు ఉన్న ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ టెస్టు చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.
డ్రైవింగ్ శిక్షణకు..
డ్రైవింగ్ నేర్పించేందుకు కాలపరిమితికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లైట్ వెహికిల్ ట్రైనింగ్‌ను కచ్చితంగా నాలుగు వారాల పాటు, కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలి. ఇందులో ఎనిమిది గంటలు థియరీ, 21 గంటలు ప్రాక్టికల్ ఉంటుంది. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరు వారాల పాటు కనీసం 39 గంటల ట్రెయినింగ్ ఇవ్వాలి. ఎనిమిది గంటలు థియరీ, 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

