హొర్ముజ్ పూర్తిగా మా ఆధీనంలోనే
ప్రస్తుతం హొర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను ఇరాన్ను నమ్మబోనని వెల్లడించారు. తన ఓహియో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘హొర్ముజ్పై ఇరాన్ కు ఎలాంటి నియంత్రణ లేదు. అది పూర్తిగా మా ఆధీనంలోనే ఉంది’ అని ఆయన తెలిపారు.
- ట్రంప్ ప్రకటన..అదేం లేదన్న టెహ్రాన్
వాషింగ్టన్, ఆగస్టు 12: ప్రస్తుతం హొర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను ఇరాన్ను నమ్మబోనని వెల్లడించారు. తన ఓహియో పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘హొర్ముజ్పై ఇరాన్ కు ఎలాంటి నియంత్రణ లేదు. అది పూర్తిగా మా ఆధీనంలోనే ఉంది’ అని ఆయన తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లో హొర్ముజ్ను తెరవం
ఒక వైపు హొర్ముజ్ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలో ఉందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటుండగా, అలాంటిదేమీ లేదని టెహ్రాన్ కొట్టివేసింది. హొర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేసింది. యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లింపు సహా పలు డిమాండ్లను అమెరికా అంగీకరించే వరకు జలసంధి మూసివేత కొనసాగుతుందని తెలిపింది.
కాగా, హొర్ముజ్ మీదుగా రవాణా నిలిపివేతతో అమెరికా మిత్రదేశాలతోపాటు పలు ప్రపంచ దేశాలు తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధరలు బ్యారల్కు అంతర్జాతీయ విపణిలో 90 డాలర్లకు చేరుకుంది. అయితే టెహ్రాన్ పట్ల తాను నిరాడంబరంగా వ్యవహరిస్తున్నానని, ఆర్థికంగా వారిని ఓపికతో ఎదుర్కోగలనని భావిస్తున్నట్టు ట్రంప్ ఆదివారం పేర్కొని తన మొండిపట్టును కొనసాగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

