హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు తిరుపతి విమానాశ్రయంలో ఈ -వీసా సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది.
విదేశీ భక్తులు తిరుమలకు రావాలంటే చెన్నై లేదా బెంగళూర్ లేదా హైదరాబాద్ చేరుకొని.. అకడ ఈ-వీసా ప్రక్రియ పూర్తిచేసుకుని అటు నుంచి తిరుమలకు చేరుకునేవారు. తాజా నిర్ణయంతో తిరుపతి విమానాశ్రయంలోనే ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి.