e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home సిద్దిపేట వెల్లివిరుస్తున్న మానవత్వం

వెల్లివిరుస్తున్న మానవత్వం

వెల్లివిరుస్తున్న మానవత్వం
  • కరోనాతో చనిపోతే అన్నీ తామవుతున్న ముస్లిం యువత
  • సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు
  • వెల్లువెత్తుతున్న అభినందనలు

సిద్దిపేట టౌన్‌, మే 30 : కరోనా సోకిందంటే దగ్గరకు వెళ్లేందుకు భయపడే రోజులివి. అలాంటిది కరోనాతో చనిపోతే వారి దహన సంస్కారాలు అన్నీ తామై సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన ముస్లిం యువత కరోనాతో చనిపోయిన వారు చివరి చూపునకు నోచుకొని క్షణాలను చూసి చలించారు. ఆఖరి సఫర్‌ పేరిట వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి కరోనాతో ఏ మతం వారు చనిపోయిన అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. 15 రోజులుగా కరోనా బారినపడి చనిపోయిన 50 మంది అంత్యక్రియలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు. సిద్దిపేట గణేశ్‌నగర్‌లో నివాసముంటున్న యుగేందర్‌ తండ్రి శ్రీను కరోనాతో మృతిచెందాడు. అతని అంత్యక్రియలను స్వగ్రామం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో, గుండారం సమీపంలో ఓ చిన్న పల్లెలో మరో వ్యక్తి చనిపోగా, హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపారు. ముస్లిం యువత కులమతాలకతీతంగా కరోనా విపత్కర సమయంలో చేస్తున్న సేవా స్ఫూర్తిగా ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాతో ఎవరైన చనిపోతే 93909 09912, 9160410312 నంబర్లకు ఫోన్‌ చేయాలని సోహెల్‌, హాజీ, ఫర్వేజ్‌, అబ్బాస్‌, అతీక్‌, నవాజ్‌, ముఖిద్‌ కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వెల్లివిరుస్తున్న మానవత్వం

ట్రెండింగ్‌

Advertisement