సిద్దిపేట జోన్, ఏప్రిల్ 19 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల (స్క్రూటీని) పరిశీలన ముగిసింది. మొత్తం 43 వార్డులకు గాను 577 నామినేషన్లు రాగా, 3 నామినేషన్లు తిరస్కృతికి గురయ్యాయి. 349 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అభ్యర్థులు ఒక్కొక్కరు 2, 3 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 349 నామినేషన్లను చెల్లుబాటు అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి 120, బీజేపీ నుంచి 72, కాంగ్రెస్ నుంచి 42, సీపీఐ 1, సీపీఎం 1, ఎంఐఎం 6, స్వతంత్రులు 107 నామినేషన్లను దృవీకరించారు. వార్డుల వారీగా చూస్తే 1వ వార్డులో 7 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 2వ వార్డులో 13 నామినేషన్లు గాను 2 బీజేపీ, 2 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 6 స్వతంత్రులు, 3వ వార్డులో 7 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 4వ వార్డులో 1 నామినేషన్ తిరస్కరణకు గురికాగా, 4 నామినేషన్లలో 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 5వ వార్డులో 8 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 5 టీఆర్ఎస్, 6వ వార్డులో 14 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 7 టీఆర్ఎస్, 5 స్వతంత్రులు, 7వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 8వ వార్డులో 5 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 9వ వార్డులో 7 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 సీపీఐ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 10వ వార్డులో 6 నామినేషన్లు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 11వ వార్డులో 11 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 4 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 12వ వార్డులో 10 నామినేషన్లకు గాను 4 బీజేపీ, 1 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 13వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 6 స్వతంత్రులు, 14వ వార్డులో 13 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 15వ వార్డులో 5 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 2 టీఆర్ఎస్, 16వ వార్డులో 11 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 7 స్వతంత్రులు, 17వ వార్డులో 4 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 18వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 19వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 సీపీఎం, 1 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 2 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 20వ వార్డులో 11 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 5 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 21వ వార్డులో 7 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 22వ వార్డులో 4 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 2 టీఆర్ఎస్, 23వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 5 స్వతంత్రులు, 24వ వార్డులో 10 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 25వ వార్డులో 5 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 26వ వార్డులో 6 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 27వ వార్డులో 8 నామినేషన్లకు గాను 2 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 28వ వార్డులో 9 నామినేషన్లకు గాను 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 5 స్వతంత్రులు, 29వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 1 ఎంఐఎం, 5 స్వతంత్రులు, 30వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 1 ఎంఐఎం, 4 టీఆర్ఎస్, 2 స్వతంత్రులు, 31వ వార్డులో 6 నామినేషన్లకు గాను 4 బీజేపీ, 1 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 32వ వార్డులో 9 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 4 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 33వ వార్డులో 5 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 34వ వార్డులో 4 నామినేషన్లకు గాను 1 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 35వ వార్డులో 6 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 36వ వార్డులో 8 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 4 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 37వ వార్డులో 5 నామినేషన్లకు గాను 1 కాంగ్రెస్, 1 టీఆర్ఎస్, 3 స్వతంత్రులు, 38వ వార్డులో 6 నామినేషన్లకు గాను 2 బీజేపీ, 1 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 39వ వార్డులో 8 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 2 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్, 1 స్వతంత్రులు, 40వ వార్డులో 9 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 41వ వార్డులో 8 నామినేషన్లకు గాను 4 బీజేపీ, 1 కాంగ్రెస్, 3 టీఆర్ఎస్, 42వ వార్డులో 10 నామినేషన్లకు గాను 3 బీజేపీ, 3 టీఆర్ఎస్, 4 స్వతంత్రులు, 43వ వార్డులో 10 నామినేషన్లకు గాను 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 7 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు సరైనవిగా తేల్చారు.
తిరస్కృతికి గురైన నామినేషన్లు ..
4వ వార్డులో ముష్ణం లక్ష్మిగౌడ్ ఓటరు లిస్టు సీరియల్ నంబరు తప్పుగా ఉండడంతో రిజక్ట్ చేశారు. 18వ వార్డులో గరిపెల్లి భాగ్యలక్ష్మి నామినేషన్‌పై ప్రతిపాదకుని సంతకం లేనందున, 43వ వార్డులో వల్లెపు శైలజ నామినేషన్ ఫారంలోని పార్ట్ -3లో సంతకం లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల తిరస్కృతికి గురైన అభ్యర్థులు కలెక్టరేట్లో ఈ నెల 20న అప్పిలెట్ అథారిటీ అధికారి జయచంద్రారెడ్డి వద్ద అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఇవీ కూడా చదవండి…
2 లోపు ఆ కమిటీ భేటీ కష్టం.. ఎందుకంటే!
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి