e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సిద్దిపేట భారీ వర్షం

భారీ వర్షం

భారీ వర్షం

గజ్వేల్‌, జూన్‌ 4 : గజ్వేల్‌ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని వర్గల్‌, జగదేవ్‌పూర్‌, ములుగు, మర్కూక్‌, కొండపాక మండలాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన వర్షం 3.30 వరకు కురిసింది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడవకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతుల ధాన్యాన్ని వెంటవెంటనే హమాలీల సహాయంతో లోడ్‌ చేసి రైస్‌ మిల్లులకు తరలించారు.

చేర్యాలలో..
చేర్యాల, జూన్‌ 4 : చేర్యాల మండలం ఆకునూరులో జోరుగా వర్షం కురియడంతో గ్రామంలోని ప్రధాన వీధులతోపాటు అంతర్గత రహదారులు జలమయం అయ్యాయి. ఆకునూరుతోపాటు పరిసర గ్రామాల్లో సైతం వర్షం కురిసింది. వర్షం కురవడంతో రైతులు సాగుకు సన్నద్ధం అవుతున్నారు.

జగదేవ్‌పూర్‌లో..
జగదేవ్‌పూర్‌, మే 4 : మండల కేంద్రంతోపాటు వట్టిపల్లి, చాట్లపల్లి, గొల్లపల్లి, తీగుల్‌, పీర్లపల్లి, బస్వాపూర్‌, మునిగడప, తిమ్మాపూర్‌ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసింది. వట్టిపల్లి గ్రామంలో ఇండ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. గొల్లపల్లిలో కుండపోత వర్షానికి కుమ్మరి చెరువు సగానికిపైగా నిండింది.

రాయపోల్‌లో..
రాయపోల్‌, జూన్‌ 4 : మండలంలో మంతూర్‌, అనాజీపూర్‌, చిన్నమాసాన్‌పల్లి, తిమ్మక్కపల్లి, రాయపోల్‌, రాంసాగర్‌, కొత్తపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.

మద్దూరులో..
మద్దూరు, జూన్‌ 4: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి ఒర్రెలు పొంగిపొర్లగా పొలాలు నీటితో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యం కొంతమేర తడిసింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.

హత్నూరలో..
హత్నూర, జూన్‌ 4 : హత్నూర మండలంలో ఈదురుగాలులతో కూడినవర్షం కురిసింది. దీంతో అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారీ వర్షం

ట్రెండింగ్‌

Advertisement