Chandu Champion | ‘చందూ ఛాంపియన్’ లేటెస్ట్ అప్డేట్.. తన పాత్రకి డబ్బింగ్ చెప్పిన కార్తీక్ ఆర్యన్
Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’(Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్(Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. విడుదల తేదీ కూడా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయనున్నారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మూవీలో తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేశాడు కార్తీక్ ఆర్యన్. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. భారతదేశం నుండి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. ఈ సినిమాను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

