గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 10, 2021 , 00:08:01

ఎల్లారెడ్డి పేట లిప్టు ఇరిగేషన్‌కు రూ.86.12 కోట్లు మంజూరు

ఎల్లారెడ్డి పేట లిప్టు ఇరిగేషన్‌కు రూ.86.12 కోట్లు మంజూరు

లిప్టు కింద 15 వేల ఎకరాల ఆయకట్టు

16 గ్రామాల రైతులకు ప్రయోజనం 

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న రైతులు 

సిద్దిపేట ప్రతినిధి, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లారెడ్డి పేట లిప్టు ఇరిగేషన్‌కు రూ.86.12 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ డిసెంబర్‌ 10వ తేదీన  సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎల్లారెడ్డి లిప్టు ఇరిగేషన్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.   లిప్టు ఇరిగేషన్‌ను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు కావడంతో లిప్టు ఇరిగేషన్‌ పనులు త్వరితగతిన పూర్తి కానున్నాయి. లిప్టు ఇరిగేషన్‌తో సుమారుగా 16 గ్రామాలకు సాగునీరందుతున్నది. దీని కింద 15 వేల ఎకరాల ఆయకట్టు రానున్నది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం ఎల్లారెడ్డి పేట వద్ద పంప్‌హౌస్‌ (లిప్టు) ఏర్పాటు చేస్తారు. రంగనాయకసాగర్‌, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ల ద్వారా ఎత్తు ఉన్న గ్రామాలకు  సాగునీరందించనున్నారు. ప్యాకేజీ -12లో భాగంగా ఎల్లారెడ్డి పేట వద్ద పంపుహౌస్‌ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ప్రెజర్‌ పైపుల (1.6) ఇర్కోడు వరకు పంపింగ్‌ చేస్తారు. అక్కడి నుంచి చిన్నచిన్న పైపులు ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తారు. 

లిప్టు ఇరిగేషన్‌తో 15వేల ఎకరాలకు ఆయకట్టు 

ఎల్లారెడ్డి లిప్టు ఇరిగేషన్‌తో 16 గ్రామాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగనున్నది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ యేడాది చివరి నాటికి పూర్తి కానున్నది. సిద్దిపేట రూరల్‌ మండలం బుస్వాపూర్‌ 908 ఎకరాలు, ఇర్కోడు 1135, తోర్నాల 864, వెంకటాపూర్‌ 892 మొత్తం 3,799 ఎకరాలు. తొగుట మండలం బండారుపల్లి 1179, ఎల్లారెడ్డిపేట 554, ఘణపూర్‌ 796, గుడికందుల 1373 మొత్తం 5,455 ఎకరాలు. మిరుదొడ్డి మండలం మిరుదొడ్డి 107, ధర్మారం 319 మొత్తం 426 ఎకరాలు. దుబ్బాక మం డలం పెద్దగుండవెల్లి 1724, తిమ్మాపూర్‌ 1742 మొత్తం 3466 ఎకరాలు. కొండపాక మండలం సిర్సినగండ్ల 607, కొండాపూర్‌ 311, మర్పడగ 936 మొత్తం 1854 ఎకరాలు ఆయకట్టు సాగులోకి రానున్నది. లిప్టు ఇరిగేషన్‌తో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లోని 16 గ్రామాలు  కానున్నాయి. 

VIDEOS

logo