ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Dec 26, 2020 , 00:17:47

అంబరాన్నంటిన క్రిస్మస్‌ సంబురాలు

అంబరాన్నంటిన క్రిస్మస్‌ సంబురాలు

గజ్వేల్‌ అర్బన్‌ : గజ్వేల్‌ పట్టణంలోని దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బాలయేసు పుణ్యక్షేత్రంతోపాటు అన్ని చర్చిల్లో శుక్రవారం ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్‌ పండుగను ఘనం గా జరుపుకొన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని గురువారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం బాలయేసు చర్చిలో ఫాదర్‌ బైబిలు పఠించి భక్తులను వినిపించారు. పూజల అనంతరం  భక్తులకు బాప్తిసం అందించారు. ఏసుక్రీస్తుకు సంబంధించి స్తోత్రాలు చేశారు. అలాగే ఇతర చర్చిల్లో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్‌లు కట్‌ చేసి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమాల్లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పాల్గొని క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్‌ బాలయేసు పుణ్యక్షేత్రాన్ని వివిధ ఆకృతులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ బాలయేసును దర్శించుకున్న భక్తులు అలంకరణను చూసి ఆనందానికి లోనయ్యారు. చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసి బాలయేసు జన్మవృత్తాంతాన్ని తెలుపుతూ తయారు చేసిన పూరిపాక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  

VIDEOS

logo