ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం | మెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్ హిల్స్‌లో అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపును చట్టసభ్యులు ధ్రువీకరిస్తున్న నేపథ్యంలో.. ట్రంప్ ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అల్లర్లకు దారి తీశాయని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పోస్టులను తొలగించడంతో పాటు బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. జనవరి 6న ఫేస్బుక్ ద్వారా ట్రంప్ చేసిన పోస్టులు సంస్థ నియమాలను ఉల్లంఘించాయని, కంపెనీ వరల్డ్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు నిక్ క్లెగ్ పేర్కొన్నారు. దీంతో రెండేళ్ల పాటు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిర్ణయంపై మరోసారి సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు. ఆయన ఖాతాను కనీసం 2023 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది.
‘ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించగలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలి’ అని ఫేస్బుక్ పేర్కొంది. కష్టతరమైన కంటెంట్‌పై స్వతంత్రంగా పర్యవేక్షించేందుకు ఫేస్బుక్ పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చింది. ఇప్పటి వరకు ట్రంప్ సస్పెన్షన్ అత్యంత ఉన్నత స్థాయి కేసు. ట్రంప్ ఖాతాను ఫేస్బుక్ రెండేళ్ల పాటు నిషేధించడంపై వైట్‌హౌస్ సెక్రెటరీ జెన్ సాకి విలేకరులతో మాట్లాడుతూ ఖాతాల నిషేధంపై నిర్ణయాలను ప్లాట్‌ఫామ్‌లను నడుపుతున్న సంస్థలకే వదిలేయాలన్నారు. ఎన్నికలైనా, టీకాల గురించి అయినా ఫేస్బుక్, ట్విట్టర్.. మరేదైనా ప్లాట్ ఫారమ్.. తప్పుడు సమాచార వ్యాప్తిని కంపెనీలు అరికట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

