నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ | ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం నుంచి టీకాలు వేయనున్నారు.

హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం నుంచి టీకాలు వేయనున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, యూకేతో పాటు ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో.. ఇప్పటికే విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకున్న రాష్ట్ర విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వారికి టీకాలు వేయాలని నిర్ణయించింది. టీకాలు వేసేందుకు శుక్రవారం పోర్టల్ అందుబాటులోకి తీసుకురాగా.. తొలిరోజు మూడువేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. కేటగిరిలో రోజుకు 350 మందికి టీకాలు వేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. శనివారం టీకాలు తీసుకోనున్న 350 మంది విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపారు. విడుతల వారీగా విద్యార్థులందరికీ మెస్సేజ్‌లు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
మరో వైపు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండో టీకా పొందే గడువును సైతం ప్రభుత్వం సడలించింది. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాలకే రెండో డోసు పొందడానికి అవకాశం కల్పించింది. హైదరాబాద్ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ టీకా పంపిణీ కొనసాగనుంది. టీకా వేయించుకునేందుకు ప్రతి విద్యార్థి తన మొబైల్‌కు వచ్చిన సంక్షిప్త సందేశాన్ని, ఓటీపీని తప్పక చూపించాల్సి వ్యాక్సినేషన్ సెంటర్లో తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
పాస్పోర్టుతో పాటు వీసాను వెంట తెచ్చుకోవాలి, వీసా లేకపోతే.. ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారో ఆ సంస్థలో ప్రవేశపత్రాన్ని చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. 18-44 ఏళ్ల మధ్య వయస్కులైన విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఇక్కడ టీకా వేయనుండగా.. లాక్డౌన్ సందర్భంగా ఎక్కడైనా పోలీసులు ఆపితే.. మొబైల్లో ఉన్న సంక్షిప్త సందేశాన్ని చూపిస్తే అనుమతి ఇస్తారని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

