e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిల్లాలు ఊరూరా బోనాలు

ఊరూరా బోనాలు

గ్రామదేవతలకు మొక్కులు
ఉప్పొంగిన భక్తిభావం
డప్పుచప్పుళ్లతో ఊరేగింపు
పోతరాజుల విన్యాసాలు
ప్రజాప్రతినిధుల ప్రత్యేక పూజలు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 1 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి నిలయమైన బోనాల మహోత్సవం జిల్లా కేంద్రం సిద్దిపేటలో ఆదివారం వైభవంగా జరిగింది. మోహిన్‌పుర లోని స్వయంభూ దీకొండ మైసమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేషన్‌ చైర్మన్‌
దీకొండ మైసమ్మ అమ్మవారిని పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు వారిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు.
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
బోనాల ఊరేగింపులో డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నా యి. మైసమ్మ ఆలయ ఆవరణలో పెద్దపట్నం వేశారు. ఆలయ కమిటీ మహిళా విభాగం స్నేహితుల దినోత్సవం నిర్వహించారు.
బోనమెత్తిన పల్లెలు
బెజ్జంకి/ కోహెడ/ హుస్నాబాద్‌ రూరల్‌/దౌల్తాబాద్‌/ తొగుట/ నంగునూరు/ కొమురవెల్లి/ గజ్వేల్‌, ఆగస్ట్టు 1: బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యం లో పోచమ్మ బోనాలు నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు బొమ్మకంటి రామలింగారెడ్డి, సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కోహెడ మండలం కూరెల్లలో సర్పంచ్‌ గాజుల రమేశ్‌ ఆధ్వర్యంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. సముద్రాల గ్రా మంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు.
హుస్నాబాద్‌ రూరల్‌ మండలంలోని పొట్లపల్లిలో పోచమ్మబోనాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దేవసాని సుశీలరాజిరెడ్డి, వార్డు సభ్యులు బత్తిని మహేశ్‌గౌడ్‌, పాకాల శ్యాసుందర్‌గౌడ్‌, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యం లో మహిళలు పోచమ్మకు బోనాలు సమర్పించారు. తొగుట మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకట్‌రావుపేటలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో సామూహిక వన భోజనాలు నిర్వహించారు.
నంగునూరు మండలం పాలమాకులలో ముదిరాజ్‌ సం ఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు.
కొమురవెల్లి మండలంలోని కిష్టంపేటలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యం లో గ్రామదేవతలకు బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో సర్పంచ్‌ బీమనపల్లి కరుణాకర్‌, ఎంపీటీసీ బందెల దుర్గారెడ్డి, ఉప సర్పంచ్‌ ఐలయ్య పాల్గొన్నారు.
వర్గల్‌ మండలంలోని మజీదుపల్లి, ములుగు మండలం లోని నర్సాపూర్‌ గ్రామాల్లో గ్రామ దేవతలకు బోనాలు సమ ర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana