Whatsapp | వాట్సాప్‌లో ఇక మొబైల్ నంబర్లు కనిపించవు.. భారీ మార్పులు తీసుకొస్తున్న మెటా!
Whatsapp | ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను సర్ప్రైజ్ చేస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది.
Whatsapp | ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో యూజర్లను సర్ప్రైజ్ చేస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేస్తే అవతలివ్యక్తులకు మన ఫోన్ నెంబర్ కనిపించేది. దీనివల్ల ఒక్కోసారి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేది. అందుకే అవతలి వ్యక్తులకు ఇకపై మన ఫోన్ నెంబర్ తెలిసే వీలు లేకుండా వాట్సాప్ యూజర్‌నేమ్ అని పిలిచే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ అప్‌కమింగ్ ఫీచర్ గురించి వాట్సాప్ బీటా ఇన్ఫో ( WABetaInfo ) ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ప్రకారం.. మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే అవతలి వ్యక్తులకు మన ఫోన్ నెంబర్ బదులు యూజర్ నేమ్ కనిపిస్తుంది. దీనికోసం యూనిక్ యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్లో కనిపించిందని WABetaInfo వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. దీని ప్రకారం వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యూనిక్ యూజర్‌నేమ్ సెట్ చేసుకోవడం ద్వారా దాంతోనే బంధుమిత్రులు, తెలిసిన వాళ్లతో కాంటాక్ట్ అవ్వొచ్చు. అలాగే ఏవైనా గ్రూపుల ద్వారా కాంటాక్ట్ అయ్యే వ్యక్తులకు కూడా మన ఫోన్ నెంబర్ కనిపించకుండా జాగ్రత్త పడొచ్చు.
📝 WhatsApp beta for Android 2.23.11.15: what’s new?
WhatsApp is working on a feature to set up a WhatsApp username, and it will be available in a future update of the app!https://t.co/2yMpvlvkdo pic.twitter.com/s60sQdy9jP
— WABetaInfo (@WABetaInfo) May 24, 2023
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది కాబట్టి ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు. అయితే.. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ యాప్‌లో యూజర్‌నేమ్ సెర్చ్ చేయడం ద్వారా కూడా సంబంధిత వ్యక్తులను కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు టెక్నిపుణులు భావిస్తున్నారు. అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ తొందరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Read More :
“WhatsApp Edit | ‘ఎడిట్’ ఫీచర్ ప్రారంభించిన వాట్సాప్.. మెసేజ్‌లో పొరపాటు ఎలా ఎడిట్ చేయాలంటే..?!”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

