WhatsApp Edit | ‘ఎడిట్’ ఫీచర్ ప్రారంభించిన వాట్సాప్.. మెసేజ్‌లో పొరపాటు ఎలా ఎడిట్ చేయాలంటే..?!
WhatsApp Edit | వాట్సాప్ తన యూజర్లకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ అనుమతి ఇస్తుంది.
WhatsApp Edit | ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ యూజర్లకు ఎట్టకేలకు న్యూ‘ఎడిట్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే మీ పర్సనల్ చాట్స్’కు లాక్ ఆప్షన్ జత చేసిన వాట్సాప్.. తాజాగా మరో అప్ డేట్ సోమవారం అందించింది. మీ బంధు మిత్రుల్లో ఎవరికైనా పంపిన మెసేజ్‌ల్లో పొరపాట్లు దొర్లుతుండవచ్చు. ఆయా పొరపాట్లను సరిదిద్దుకోవడానికి వాట్సాప్ 15 నిమిషాల విండో అవకాశం కల్పించింది. ఇక నుంచి ఏదైనా మెసేజ్‌లో తప్పు దొర్లితే పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేదు. తొలుత అనుకున్న మెసేజ్ సరిగ్గా వచ్చే వరకు ఎడిట్ బటన్ ఆప్షన్ వాడొచ్చు. యూజర్లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు.
‘మీ చాట్స్ మీద మీకు ఇప్పుడు మరింత నియంత్రణ కలిగి ఉన్నందుకు మేం ఆనందంతో ఉన్నాం. ఎడిట్ ఆప్షన్ సాయంతో మెసేజ్‌లో స్పె్ల్లింగ్ పొరపాట్లు సరి చేయడం గానీ, మరింత టెక్ట్స్ జత చేయడం చేయవచ్చు. ఒక మెసేజ్ పంపిన తర్వాత 15 నిమిషాల్లోపు ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పంపిన మెసేజ్ మీద టాప్ చేసి హోల్డ్ లో పెట్టాలి. అటుపై మెసేజ్ సరి చేసిన తర్వాత పంపించాలి’ అని వాట్సాప్ తన బ్లాగ్‌పోస్ట్‌లో రాసుకున్నది.
యూజర్లు తప్పు మెసేజ్ లు పంపి.. ఇబ్బందులు పడే వారు. అటువంటి వారికి ఈ ఎడిట్ ఆప్షన్ రిలీఫ్ కల్పిస్తుంది. ఎడిటింగ్ కోసం 15 నిమిషాల టైం తక్కువేం కాదు.. చాలా మందికి సరిపోతుంది. ఒకవేళ మీరు చాలా పొడవైన మెసేజ్ పంపి ఉంటే.. దాన్ని ఎడిట్ చేయడానికి మాత్రం సమయం కొద్దిగా మాత్రమే ఉంటుంది. యూజర్లందరికీ కొత్తగా ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినా.. తక్షణం అందరికీ అందుబాటులోకి రాదని వాట్సాప్ పేర్కొంది. యూజర్లంతా అప్ డేట్ కావడానికి సమయం పడుతుందని వాట్సాప్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

