WhatsApp | వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..! మీ చాట్ ఎవరికీ కనిపించకుండా ఇలా లాక్ చేసేయండి
WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది.
WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నో ఫీచర్స్‌ను తీసుకువచ్చిన మెటా యాజమాన్యంలోని కంపెనీ.. మరో సరికొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ప్రయోగాత్మకంగా ఫీచర్‌ను పరీక్షించిన తర్వాత సోమవారం రాత్రి కంపెనీ విడుదల చేసింది. ఈ ఫీచర్‌ను ‘చాట్‌లాక్’ పేరు పెట్టింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్లను ఈ ఫీచర్‌తో మరింత గోప్యంగా ఉంచుకోవచ్చు.
పాస్వర్డ్ ప్రొటక్షన్, ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. దాంతో ఇతరులెవరూ మీ చాట్‌ను చూడలేరు. చాట్స్, సంభాషణలను లాక్ చేయడమే కాకుండా ప్రత్యేక ఫోల్డర్లో వాటిని స్టోర్ చేస్తుంది. వేరే వ్యక్తులు ఎవరైనా యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే చాట్ మొత్తాన్ని ఎరేజ్ చేయాలని కోరుతుంది. ఇదిలా ఉండగా.. చాట్ లాక్ ఫీచర్‌ను పరిచయం చేసినందుకు సంతోషంగా ఉందని మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. యూజర్ల సీక్రెట్ సంభాషణలు, చాట్స్‌కు అదనపు సెక్యూరిటీని అందించే కొత్త ఫీచర్ చాట్ లాక్ అని తెలిపారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
వాట్సాప్‌లో చాట్లాక్ను ఎలా వాడాలంటే..?
ఏదైనా చాట్‌ను లాక్‌ను చేస్తే ఇక ఇన్‌బాక్స్‌లో కనిపించదు. ఈ చాట్ మరో ఫోల్డర్లోకి మారిపోతుంది. ఆ ఫోల్డర్‌ను పాస్వర్డ్, ఫింగర్‌ప్రింట్‌తోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సంబంధిత చాట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా.. ఆ నోటిఫికేషన్ ఆటోమెటిక్‌గా హైడ్ అవుతుంది. ఈ చాట్‌లాక్ ఫీచర్‌కు రాబోయే రోజుల్లో మరిన్ని ఆప్షన్స్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.
చాట్‌ను లాక్ చేసుకోండిలా..!
ఈ ఫీచర్ కోసం ముందుగా వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ వర్షన్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత ఏదైతే చాట్‌ని లాక్ చేయాలని భావిస్తున్నారో.. దానికి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ‘చాట్ లాక్’ అని కనిపిస్తుంది. డిసప్పియరింగ్ మెసేజ్ మెనూ కింద ఉంటుంది. ఈ చాట్లాక్ను ఎనేబుల్ చేసుకోవాలి. లాక్ కోసం పాస్ట్‌వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. లాక్ చేసిన చాట్‌ను చూడాలంటే వాట్సాప్ హోంపేజీని కిందకి స్వైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసినా.. ఫింగర్ ప్రింట్‌ను ఇస్తే ఓపెన్ అవువుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

