Tech Tips | స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీ ప్రైవసీ భద్రంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు మస్ట్‌గా తీసుకోండి!
Tech Tips | మానవ జీవన విధానంలో సాంకేతికత భాగమైంది. ‘సెల్‌ఫోన్ ముట్టుకోవాలంటేనే బిల్లు పడుతుందేమో!’ అని భయపడే రోజుల నుంచి పది నిమిషాలు సెల్‌ఫోన్ పట్టుకోకపోతే... దిగులు చెందే పరిస్థితులకు చేరుకున్నాం. ఈ పరిణామ క్రమంలో మనిషి ఎన్నో సాధిస్తున్నాడు, మరెన్నో కోల్పోతున్నాడు.
Tech Tips | మానవ జీవన విధానంలో సాంకేతికత భాగమైంది. ‘సెల్‌ఫోన్ ముట్టుకోవాలంటేనే బిల్లు పడుతుందేమో!’ అని భయపడే రోజుల నుంచి పది నిమిషాలు సెల్‌ఫోన్ పట్టుకోకపోతే… దిగులు చెందే పరిస్థితులకు చేరుకున్నాం. ఈ పరిణామ క్రమంలో మనిషి ఎన్నో సాధిస్తున్నాడు, మరెన్నో కోల్పోతున్నాడు. సాంకేతికంగా విలక్షణ రక్షణ కవచాలు ఎన్ని ఉన్నా.. స్వీయ తప్పిదాలతో చాలామంది ముప్పు తెచ్చుకుంటున్నారు. తెలిసీ తెలియక చేసే తప్పులను సరిదిద్దుకుంటే.. స్మార్ట్ దునియాలో ఇస్మార్ట్ వినియోగదారులు మీరే అవుతారు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ… ఫోన్ భద్రత మరింత పటిష్టమవుతూ వస్తున్నది. ఫింగర్ ప్రింట్ లాక్, ప్యార్టన్ సిస్టమ్, ఐరిస్ లాక్, ఫేస్ రికగ్నిషన్, పాస్వర్డ్ ఇలా రకరకాల రక్షణ తంత్రాల కారణంగా మన ఫోన్ పరులకు చిక్కినా..
తక్షణంగా వాటిల్లే ప్రమాదం అంతగా ఉండకపోవచ్చు. అయితే, విరూపాక్ష చిత్రంలో శాసనాల గ్రంథం తారుమారై.. అష్టదిగ్బంధనం అస్తవ్యస్తమైనట్టు… సామాజిక మాధ్యమాల్లో మన చైతన్యం శ్రుతిమించితే జీవితం లయ తప్పే ప్రమాదం ఉంది. ఎఫ్బీ పోస్టింగులు, ట్విటర్లో కామెంట్లు, ఇన్‌స్టా ఆసక్తులతోపాటు అనవసర భయాలు, అత్యాశ ఇవే స్మార్ట్ వినియోగదారుడిని ఈజీగా దారితప్పించి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ కనిపించని వలలో చిక్కుకోకూడదు అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
తస్మాత్ జాగ్రత్త
☞ సోషల్ మీడియాలో మన వ్యవహారశైలి ఆధారంగా మనమేంటో చెప్పేస్తుంది. ఏది పోస్ట్ చేసినా… అంతకుముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం అవసరం. ఏదైనా పోస్ట్ మీ ఫోన్ దాటితే… ఒక్కోసారి అది నిమిషాల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. అందుకే, ఏ పోస్టింగ్‌ల విషయంలోనూనిర్లక్ష్యంగా పనికిరాదు.
☞ రోజువారీ కార్యకలాపాలు ప్రతిదీ సామాజికమాధ్యమాల్లో షేర్ చేయొద్దు. సున్నితమైన వ్యక్తిగత అంశాలపై అతిగా స్పందించడం వల్ల అసలుకే ఎసరు రావొచ్చు. మీరు పోస్ట్, షేర్ చేసే సందేశాల ఆధారంగా మీ వ్యక్తిగత ఆసక్తులను గమనించి ఫ్రాడ్స్టర్లు వల విసిరే ప్రమాదం ఉంది.
☞ నిజాన్ని నిర్ధారించకుండా ఏ పోస్ట్ చేయొద్దు. రాజకీయంగా దుమారం లేపే అంశాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఫేస్బుక్, వాట్సాప్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. రాజకీయ ప్రముఖులకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలూ షేర్ చేస్తుంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని పోస్ట్ చేస్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే. www.factly.com , www.boomlive.in వెబ్సైట్ల ద్వారా ఏ వార్త సత్యమైందో, ఏది అసత్యమో తెలుసుకోవచ్చు.

ప్రైవసీని కాపాడుకోండి..
☞ ఫోన్లో బ్రౌజర్‌ను వాడేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను గానీ, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ను గానీ ఉపయోగించాలి. టార్, డక్ డక్ గో తదితర బ్రౌజర్స్‌ను ఎంచుకోవాలి.
☞ లాగిన్‌లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండేవిధంగా చూసుకోవాలి.
☞ సామాజిక మాధ్యమాల్లో మీ పోస్టులుగానీ, వివరాలు గానీ ‘స్టే ప్రైవేట్’ ఉండేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఉచితంగా వస్తుంది కదా అని.. పబ్లిక్ వైఫై ఉపయోగించొద్దు.
☞ మెసేజింగ్ యాప్స్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉండేవిధంగా చూసుకోవాలి.
☞ అన్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ ఉన్నట్లయితే వెంటనే మార్చుకోండి. ప్రతి దానికీ ప్రత్యేకమైన, కఠినమైన పాస్ట్‌వర్డ్ ఎంచుకోవాలి.
☞ అనుమతి లేకుండా మిమ్మల్ని ట్యాగ్ చేసే అవకాశం లేకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
☞ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ ఉపయోగించండి. అపరిచితులతో అతిచనువు మంచిది కాదు.
ఫోన్‌ను ఇలా చూసుకుందాం..
☞ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లు డిసేబుల్ చేసుకోవాలి. దీనివల్ల నోటిఫికేటన్ టోన్ వినబడగానే ఏదో జరిగిపోయినట్టుగా అలెర్ట్ అయిపోతుంటారు. సదరు సందేశాన్ని ఆగమేఘాల మీద చూడటం, ఆపై తక్షణం స్పందించడం వంటివి తెలియకుండానే జరిగిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఇబ్బడి ముబ్బడిగా వచ్చే నోటిఫికేషన్లు మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వద్దు అనుకున్నవి చేసేలా, చేయాల్సిన వాటిని వాయిదా వేసేలా ప్రోత్సహిస్తాయి.
☞ స్మార్ట్‌ఫోన్‌కు పడకగదిలో చోటివ్వొద్దు. మీ బెడ్రూమ్ను స్మార్ట్ ఫోన్ ఫ్రీజోన్‌గా మార్చేయండి.
☞ సోషల్ మీడియా అకౌంట్లను స్మార్ట్‌ఫోన్ కన్నా.. డెస్క్‌టాప్, ల్యాపీ ద్వారా వాడటం మంచిది.
☞ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ఎలాంటి యాప్స్ లేకుండా చూసుకోండి.
☞ భోజన సమయంలో ఫోన్ దగ్గర ఉంచుకోకండి.
☞స్మార్ట్‌ఫోన్ ఎంతసేపు వాడుతున్నారన్నది కనిపెట్టుకోండి. ఐ ఫోన్ యూజర్లు ‘స్క్రీన్ టైమ్’ యాప్ ద్వారా, ఆండ్రాయిడ్ యూజర్లు ‘డిజిటల్ వెల్బీయింగ్’ యాప్ ద్వారా స్క్రీన్ మీద ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకొని, తగ్గించుకోవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!
“Deep Fakes | ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న డీప్ ఫేక్స్.. ఇవి ఎందుకంత డేంజర్?”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

