Cyber Crime Prevention Tips | నెట్ బ్యాలెన్స్ ఉందని సోషల్‌మీడియాను ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Cyber Crime Prevention Tips | తన ఆనందాలు, ఆవేశాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు ప్రపంచంతో పంచుకోవాలని చాలామంది సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంటారు. అది తప్పేం కాదు. కానీ, సరైన సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో విహరిస్తూనే ఉంటారు.
Cyber Crime Prevention Tips | దారిలో ముక్కూమొహం తెలియని వ్యక్తి తారసపడి మన ఊరూ పేరూ అడిగితే.. ఎగాదిగా చూస్తాం! ‘నీకెందుకు చెప్పాలి?’ అని నిలదీస్తాం. అతగాడు రెట్టించి అడిగితే తోక తొక్కిన తాచులా మనమూ రెచ్చిపోతాం! ఇంతవరకు బాగానే ఉంది, అదే స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం అడిగిందే తడవుగా వ్యక్తిగత సమాచారం షేర్ చేస్తాం! ‘ఎక్కడ మర్చిపోతామో’ అని పాస్‌వర్డ్‌కు ‘రిమెంబర్’ ఆప్షన్ ఎంచుకుంటాం!! మన ఏమరుపాటు గ్రహపాటుగా మారే ప్రమాదం ఉంది. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి పరిష్కరించలేని సమస్యలు సృష్టించే స్క్రాపర్లు వెబ్ దునియాలో ఎందరో ఉంటారు. ఈ సమాచార చోరుల బారిన పడొద్దంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
‘అలో.. అలో.. అలో..’ ఇది ముత్యాలముగ్గులో వెరైటీ విలనిజాన్ని పండించిన రావు గోపాల రావు డైలాగు కాదు. ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసే క్రమంలో.. అది ఏ పర్మిషన్ అడిగినా అలో (allow) చేసేస్తాం. జీవన ఆధారంగా భావించే ఆధార్ నంబర్‌నూ మారు ఆలోచన లేకుండా ఎంటర్ చేస్తాం. టోపీ పెడుతున్నాడని గ్రహించలేక ఓటీపీ చెప్పేస్తాం! అంతేకాదు, వివిధ వెబ్సైట్లలో, యాప్‌లలో మనం ఎంటర్ చేసే వ్యక్తిగత వివరాల తాలూకు సమాచారం కుకీస్‌లో అలాగే ఉండిపోతుంది. ఆ కుకీస్ అంతర్ధానమయ్యేలోపు అందులోని డేటానంతా లాగేసే సమర్థులైన వ్యక్తులు ఆన్లైన్లో పొంచి ఉంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ టూల్స్ అభివృద్ధిపరచి విస్తుపోయేలా చేస్తున్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
దేవుడు సర్వాంతర్యామి అన్నట్టుగా డేటా స్క్రాపింగ్ ఇస్మార్ట్ ప్రపంచంలో అంతటా విస్తరించి ఉంది. ఫోన్లో, సామాజిక మాధ్యమాల్లో, కుకీస్‌లో ఇలా ఉన్న మన సమాచారమంతా దోచుకుంటుంది. కొన్ని అధికారిక వ్యవస్థలు అత్యవసర పరిస్థితుల్లో ఇలా డేటా కావాల్సి వస్తే చట్టపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలా డేటాను అమ్ముకోవడమే వ్యాపారంగా పెట్టుకుని సగటు మనిషి చరిత్రను తమ గుప్పిట బంధిస్తున్నారు కొందరు!
సోషల్ మీడియాలో..
తన ఆనందాలు, ఆవేశాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు ప్రపంచంతో పంచుకోవాలని చాలామంది సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంటారు. అది తప్పేం కాదు. కానీ, సరైన సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో విహరిస్తూనే ఉంటారు. ఇదే అదనుగా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల నుంచి సమాచారాన్ని తేలికగా సంగ్రహిస్తుంటారు స్క్రాపర్లు. ప్రొఫైల్స్, వారిని ఫాలో అయ్యేవారి వివరాలు, వాళ్లు చేసిన పోస్టులు, కామెంట్లు ఒకటేమిటి అందులో పోస్ట్ చేసిన ప్రతి చిన్న విషయాన్ని చేజిక్కించుకొని దాంతో ఈ పద్ధతుల్లో చెడుగుడు ఆడుకుంటారు..
☞ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను అంచనా వేసుకొని వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు సదరు వ్యక్తికి వచ్చేలా చేయగలుగుతారు.
☞ ఒకసారి ఏదైనా వస్తువు కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తే సరి, దానికి సంబంధించిన వివిధ బ్రాండ్లు, వస్తువుల తాలూకు కామెంట్లు, రివ్యూలు కూడా మనకు చేరవేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు.
☞ ఒకరకంగా చెప్పాలంటే మన పోస్టులు, ఫాలోవర్స్ ఈ విషయాలన్నీ క్రోడీకరించి వాళ్లకు కావాల్సిన విధంగా వాడుకుంటారు.

Cyber
స్క్రాపింగ్ టూల్స్
స్క్రాపర్లు తమ పనిని నెరవేర్చడానికి ప్రత్యేకంగా కొన్ని టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
☞ ఆక్టోపర్స్: దీని ద్వారా సోషల్ మీడియాలోని సమాచారాన్ని పొందవచ్చు.
☞ ఇంపోర్ట్.ఐఓ: క్లౌడ్ బేస్డ్ డేటా స్క్రాపింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. సోషల్ మీడియా ప్రధాన టార్గెట్‌గా దీన్ని వాడుతుంటారు.
☞వెబ్హోస్.ఐవో: డేటా సర్వీస్ ప్లాట్‌ఫామ్ ఇది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సాయంతో స్క్రాపింగ్తోపాటు సోషల్ మీడియా సమాచారాన్ని యాక్సెస్ చేయొచ్చు.
☞ స్క్రాపీ: ఇది పైథాన్ ఫ్రేమ్‌వర్క్. వెబ్ స్క్రాపింగ్‌కు ఎక్కువగా ఉపయోగిస్తారు. సోషల్ మీడియా సమాచారాన్ని తీసుకుంటున్నారు.
కాపాడుకోవడం ఎలా?
☞ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రైవసీ సెట్టింగ్స్ పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. విజిబిలిటీ లిమిట్ సెట్ చేసుకోవాలి. ప్రొఫైల్ వివరాలు ఎవరు చూడాలో నిర్దేశించేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
☞ రెగ్యులర్ పాస్వర్డ్ కాకుండా కఠినమైనవి ఉండేలా చూసుకోవాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవాలి.
☞ థర్డ్ పార్టీ అకౌంట్లోకి ప్రవేశించాలంటే మీ అనుమతి తీసుకునేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
☞ ప్రైవసీ సెట్టింగ్స్, డాటా స్క్రాపింగ్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి. లాస్ట్ సీన్, ట్యాగ్ చేయడం తదితర విషయాల్లో అనుమానం కలిగితే వెంటనే సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ మార్చుకోవాలి.
☞ బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత ఫోన్ నంబర్లను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు.
☞ మన సోషల్ మీడియా అకౌంట్‌ను కొత్తగా ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు తదితర విషయాలను అప్పుడప్పుడూ రివ్యూ చేసుకుంటూ ఉండాలి.
☞ సున్నితమైన అంశాలు, వివాదాస్పద విషయాలను పోస్ట్ చేయడం గానీ, అలాంటి పోస్టులకు తీవ్రంగా స్పందించడం గానీ చేయొద్దు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Cyber Crime Preventation Tips | సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారా? వెంటనే ఈ పనులు చేయండి!
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

