Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Online Abuse | ఇంటర్నెట్ ఎన్ని అవసరాలను తీరుస్తుందో.. అన్ని విపరీతాలకూ దారి తీస్తుంది అనడంలో సందేహం లేదు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగం.. చిన్నారుల వేధింపులకు అడ్డాగా మారుతున్నది.
Online Abuse | ఇంటర్నెట్ ఎన్ని అవసరాలను తీరుస్తుందో.. అన్ని విపరీతాలకూ దారి తీస్తుంది అనడంలో సందేహం లేదు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగం.. చిన్నారుల వేధింపులకు అడ్డాగా మారుతున్నది. సెల్‌ఫోన్, వెబ్ దునియా, సామాజిక మాధ్యమాలు ఒకటేమిటి టెక్నాలజీతో ముడిపడిన ప్రతి అంశాన్నీ విపరీత చర్యలకు అస్త్రంగా మార్చుకుంటున్నారు కొందరు. పైశాచిక ఆనందం కోసం పసి హృదయాలను గాయపరుస్తున్నారు. ఇలాంటి వారినుంచి చిన్నారులను కాపాడుకోవడం సామాజిక బాధ్యత..
లైం గిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంటాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంటర్నెట్లో తరచి తరచి పోర్న్ వెబ్సైట్లు తెరిచి చూస్తుంటారు చాలామంది. 18 ఏండ్లలోపు పిల్లలకు ఇలాంటి దృశ్యాలను, చిత్రాలను చూపించడాన్ని చైల్డ్ పోర్నోగ్రఫీగా పిలుస్తారు. చాలా దేశాల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఏఎస్ఏమ్)ను తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. ఎన్ని చట్టాలు చేసినా ఈ దుశ్చర్యలు ఆగడం లేదు. పైశాచిక ఆనందం కోసం, ఆర్థిక ప్రయోజనం ఆశించి పిల్లలను వేధింపులకు గురిచేసే వారు కొందరైతే, అవకాశవాదులు మరోరకం. ఇలాంటి వారు తేనెపూసిన కత్తుల్లా వ్యవహరిస్తారు. పైకి దురుద్దేశం లేనట్టుగా ప్రవర్తించినా.. పరిస్థితులను ఆసరాగా చేసుకొని తమ వికృత రూపం ప్రదర్శిస్తుంటారు. ఎలాంటి వారైనా లైంగిక వేధింపులు తలపోసే కీచకులకు కీలెరిగి వాత పెట్టడమే సరైన పరిష్కారం.
బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన వారు కొంతకాలానికి శారీరకంగా తేరుకున్నా, మానసికంగా దీర్ఘకాలం ఆవేదనకు గురవుతూనే ఉంటారు. వాళ్ల తప్పు లేనప్పటికీ నిరంతరం ఆత్మనూన్యతకు లోనవుతుంటారు. జీవితాన్ని సాధారణంగా కొనసాగించలేక తమలో తాము సతమతమవుతారు. ఇంకొందరు పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (తీవ్ర మానసిక ఒత్తిడి) బారినపడతారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు వ్యసనాలకు బానిసగా మారుతారు.
అండగా ప్రభుత్వం
లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడానికి, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఏఎస్ఎమ్) బారినపడిన ఆడపిల్లలకు అండగా నిలబడటానికి ప్రభుత్వం 2012 నుంచి పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం అమలు చేస్తున్నది. 2021లో భారత ప్రభుత్వం డిజిటల్ మీడియా విలువలకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాలతోపాటు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సీఏఎస్ఎమ్ కంటెంట్‌ను గుర్తించడంతోపాటు దానిని తొలగించేలా గైడ్‌లైన్స్ రూపొందించింది. ప్రభుత్వంతోపాటు పలు ఎన్జీవోలు సైతం సీఏఎస్ఎమ్కు వ్యతిరేకంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. ప్రజల్లో, చిన్నారుల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అడ్డుకునే మార్గాలు
ఆడపిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న సీఏఎస్ఎమ్ అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కార్యాచరణ అమలుపరుస్తున్నది. మహిళా శిశు అభివృద్ధి శాఖ వివిధ ఏజెన్సీల సాయంతో ఇలాంటి దుశ్చర్యలను నిరోధిస్తున్నది. బాధితులకు అండగా ఉంటున్నది. సీఏఎస్ఎమ్, లైంగిక వేధింపులపై అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహిస్తున్నది. ఎన్జీవోలు సైతం ఈ యజ్ఞంలో భాగమవుతున్నాయి. పిల్లలకు ఏది ఎలాంటి స్పర్శో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పాలి. ఎవరైనా బెదిరిస్తే.. కుంగిపోకుండా ఇంట్లోవారికి విషయం చెప్పేలా వారికి నమ్మకం కలిగించాలి. కుటుంబ మర్యాద దెబ్బతింటుందని అపోహపడి బెదిరిపోకుండా వెంటనే ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు, వెబ్సైట్ల వివరాలు ఇవి..
జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్‌లైన్: 1930
వెబ్సైట్ : http://cybercrime.gov.in/
ఎన్సీపీఆర్ ఫిర్యాదుల పోర్టల్: http://www.ebaalnidan.nic.in/
చైల్డ్‌లైన్: 1098, http://www.childlineindia.org/
జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్: 7827170170, http://www.ncw.nic.in/helplines
మహిళాబోల్ హెల్ప్‌లైన్: 0124-4007444, http://mahilabol.org/women-helpline/
ప్రజ్వల ఫౌండేషన్: http://www.prajwalaindia.com/
సోషల్ మీడియాలో దుర్భాష వాడితే,అభ్యంతరకరమైన పోస్టులు పెడితే ఫిర్యాదు చేయాల్సిన లింక్‌లు..
ఫేస్బుక్: https://www.facebook.com/help/1380418588640631/?helpref=hc_fna
ఇన్స్టాగ్రామ్: https://help.instagram.com/165828726894770
గూగుల్: https://transparencyreport.google.com/child-sexual-abuse-material/reporting
ట్విటర్: https://help.twitter.com/en/forms/safety-and-sensitive-content/cse
యూట్యూబ్: https://support.google.com/youtube/answer/2802027#report_channel
ఇవి గుర్తించాలి..
☞ అభం శుభం ఎరుగని చిన్నారులకు లైంగిక సంబంధమైన విషయాలను చెప్పడం. వారికి అసభ్యకరమైన వీడియోలు చూపించడం, చిత్రీకరించడం, చూపించడం అనైతికం.
☞ పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులను ఆకర్షించడానికి చిన్నారులను పడుపు వృత్తిలోకి తీసుకురావడం. ఈ క్రమంలో పసి పిల్లలను విదేశాలకు తరలిస్తుండటం బాధాకరం. బెదిరించి, తీవ్రంగా కొట్టి, కొన్ని సందర్భాల్లో మభ్యపెట్టి ఆడపిల్లలను పాపకూపంలో పడదోస్తున్నారు.
☞ బాల్య వివాహాలు కూడా చిన్నారుల లైంగిక వేధింపులకు ప్రధాన కారణంగా మారు తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్‌లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

