Cyber Crime Preventation Tips | సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారా? వెంటనే ఈ పనులు చేయండి!
Cyber Crime Preventation Tips | సంక్షిప్త సందేశం వస్తే చాలు.. సగటు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడికి సందేహం. అందులో ఏ మాల్వేరో నిక్షిప్తమై ఉంటుందని భయం! కానీ, ఊరించే ఆఫర్లు వెల్లువలా మోసుకొచ్చే సందేశాల్లోని లింక్‌లను ఉబుసుపోక టచ్ చేసి చూసేవాళ్లూ చాలామందే ఉంటారు.
Cyber Crime Preventation Tips | సంక్షిప్త సందేశం వస్తే చాలు.. సగటు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడికి సందేహం. అందులో ఏ మాల్వేరో నిక్షిప్తమై ఉంటుందని భయం! కానీ, ఊరించే ఆఫర్లు వెల్లువలా మోసుకొచ్చే సందేశాల్లోని లింక్‌లను ఉబుసుపోక టచ్ చేసి చూసేవాళ్లూ చాలామందే ఉంటారు. మార్ఫింగ్, ఫిషింగ్ విధానం ఏదైతేనేం స్కామర్లు పన్నిన వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తక్షణ సాయం పొందడం ఎలాగో తెలుసుకుంటే మంచిది!
కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతకు సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. టెక్నాలజీపై అవగాహన లేకపోవడం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శాపంగా పరిణమించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు.. పరిణతి చెందని కొందరు వ్యక్తులు సైబర్ మోసగాళ్లకు చిటికెలో చిక్కుతున్నారు. కొందరు వినియోగదారులు తెలియనితనంతో కొరివితో తలగోక్కుంటే, మరికొందరు అత్యాశ కొద్దీ అంతులేని అగాథంలో పడిపోతున్నారు. ఆన్లైన్లో అనుక్షణం అప్రమత్తత తప్పనిసరి. మాకన్నీ తెలుసు అనుకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఊహించని విధంగా ఆన్లైన్ మాయగాళ్ల చేతిలో మోసానికి గురైతే బెంబేలెత్తిపోయి, ఎవరికి చెబితే ఏమనుకుంటారో అని సమస్యను దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకూ తెచ్చుకోవద్దు. ఆన్లైన్ ఫ్రాడ్‌కు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించడం మంచిది. విచారణ వేగవంతంగా సాగాలంటే మోసానికి సంబంధించిన సాక్ష్యాలు అవసరం. స్క్రీన్‌షాట్స్, వాట్సాప్ చాట్, ఈ-మెయిల్, వీడియో, ఆడియో ఇన్పుట్స్ ఏమున్నా పోలీసులకు అందజేయడం చాలా ముఖ్యం.
ఆధారాలు కీలకం
ఆన్లైన్ మోసాలకు గురైనప్పుడు దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌లోని సైబర్‌క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. పూర్తి వివరాలతో ఫిర్యాదు రాసివ్వాలి. మోసానికి ఎలా గురైందీ, ఏ విషయం దాచిపెట్టకుండా పేర్కొనాలి. ఆర్థిక లావాదేవీలు జరిగినట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు (స్క్రీన్షాట్లు, స్టేట్మెంట్) ఫిర్యాదుకు జతచేయాలి. సైబర్ నేరస్తులు మిమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడితే, అందుకు సంబంధించిన ఆడియో రికార్డును కూడా పోలీసులకు అందజేయాలి. సదరు మోసానికి సంబంధించి మీ దగ్గరున్న డిజిటల్ సాక్ష్యాలన్నీ పోలీసులకు సమర్పించాలి.
ఆన్లైన్లో ఫిర్యాదు..
ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు చేయడానికి రకరకాల పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి.
☏ సైబర్ బుల్లీయింగ్, పోర్నోగ్రఫీ, ఫిషింగ్‌కు సంబంధించిన నేరాలైతే https://www.cybercrime.gov.in/ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
☏ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసమైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా ఫ్రాడ్ చేసిన వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
☏ సైబర్ సెక్యూరిటీ విషయంలో జరిగే నేరాలకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఐన్)ను సంప్రదించాలి. https://cert-in.org.in/ వెబ్‌లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
☏ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా https://ceir.sancharsaathi.gov.in/Home/index.jsp లింక్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వాడుతున్నట్లుగా అనుమానం కలిగితే https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ పోర్టల్‌ను సంప్రదించాలి.
☏ అనుకోకుండా ఒక ఖాతాకు బదులుగా మరో ఖాతాకు డబ్బులు పంపితే సమస్య పరిష్కారానికి యూపీఐ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. 14448 నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. https://cms.rbi.org.in/ పోర్టల్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. CRPC@rbi.org.in ఐడీకి ఈ-మెయిల్ కూడా పంపొచ్చు.
☏ యూపీఐలో వివాదాస్పద పేమెంట్స్ సమస్యల పరిష్కారానికి https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లింక్ ఉపయోగపడుతుంది.

Cyber Crime
సంఘటన వివరాలు
☏ నేరస్తులు మిమ్మల్ని ఏ మాధ్యమం ద్వారా సంప్రదించారో తెలియజేయాలి. (వెబ్సైట్, సామాజిక మాధ్యమాలు)
☏ తేదీ, సమయం అందజేయాలి.
☏ మీరు డబ్బులు చెల్లించినట్లయితే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, అకౌంట్ స్టేట్మెంట్ వివరాలు జతచేయాలి.
అనుమానం వస్తే
☏ సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదించినప్పుడు పేరు, ఇతర వివరాలు ఏమైనా చెప్పి ఉంటే వాటిని ఫిర్యాదులో పొందుపరచాలి.
☏ వెబ్సైట్ అయితే యూఆర్ఎల్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, లొకేషన్ వివరాలు తెలిస్తే ఫిర్యాదులో పేర్కొనాలి.
ఇవి పాటించండి..
☏ మీ ఫోన్, బ్యాంక్ అకౌంట్, యూపీఐ అప్లికేషన్లకు బలమైన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
☏ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి.
☏ ఉచితంగా వస్తుంది కదా అని పబ్లిక్ వైఫైని ఉపయోగించడం సరికాదు. మీ ఇంట్లో వైఫై రౌటర్లో డబ్ల్యూపీఏ2 లేదా డబ్లూపీఏ3 ఎన్స్క్రిప్షన్ ఎనేబుల్ చేయండి.
☏ సాఫ్ట్వేర్లు, మొబైల్ అప్లికేషన్లను నమ్మకమైన సోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. అంతేకానీ, ఎవరో పంపిన లింక్ ద్వారా చేసుకోవద్దు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

