Tech Tips | మీ మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేదా?
Tech Tips | ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సరిపోదు. అందులో 5జీ డేటా ఉన్నంత మాత్రాన అయిపోదు! ఎంత ఎక్కువ అప్లికేషన్లు ఉంటే అంత గొప్పగా భావిస్తున్నది ఈ తరం! ఆటకో యాప్, పాటలకు మరో రెండు యాప్‌లు, రోజువారీగా వేసిన అడుగుల లెక్కలకో యాప్, తీసిన శ్వాసల చిట్టా కోసం ఇంకో అప్లికేషన్.. ఇలా స్టోరేజ్ అంతా యాప్‌ల గ్యారేజ్గా మారుస్తున్నారు. అయితే, వీటిలో ఏవి నమ్మకమైనవో, ఏవి మన డేటాను అమ్ముకుంటాయో తెలియకుండానే అన్నిటినీ ‘ఎలో’ చేస్తున్నారు. ఈ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు ఏ జాగ్రత్తలు పాటించాలో ఓ లుక్కేద్దాం..!
Tech Tips | ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సరిపోదు. అందులో 5జీ డేటా ఉన్నంత మాత్రాన అయిపోదు! ఎంత ఎక్కువ అప్లికేషన్లు ఉంటే అంత గొప్పగా భావిస్తున్నది ఈ తరం! ఆటకో యాప్, పాటలకు మరో రెండు యాప్‌లు, రోజువారీగా వేసిన అడుగుల లెక్కలకో యాప్, తీసిన శ్వాసల చిట్టా కోసం ఇంకో అప్లికేషన్.. ఇలా స్టోరేజ్ అంతా యాప్‌ల గ్యారేజ్గా మారుస్తున్నారు. అయితే, వీటిలో ఏవి నమ్మకమైనవో, ఏవి మన డేటాను అమ్ముకుంటాయో తెలియకుండానే అన్నిటినీ ‘ఎలో’ చేస్తున్నారు. ఈ అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు ఏ జాగ్రత్తలు పాటించాలో ఓ లుక్కేద్దాం..!
కొత్త మొబైల్ చేతికి రాగానే.. అందులో అప్లికేషన్ల వరద మొదలవుతుంది. తక్షణ అవసరాలకు కొన్ని, విలక్షణత కోసం ఇంకొన్ని ప్లేస్టోర్ అంతా వెతికి అప్లికేషన్లు దొరకబుచ్చుకుంటారు. వాటిని ఇన్స్టాల్ చేసే క్రమంలో సదరు యాప్ నిర్వాహకులు అడిగే అన్ని అనుమతులూ ఇచ్చేస్తుంటారు. వాళ్లు ఏం అడుగుతున్నది ఆలోచించే తీరిక ఎక్కడిది? ఎలో, నాట్ ఎలో రెండు ఆప్షన్లు ఉంటాయక్కడ. ‘మీ ఫోన్లోని కాంటాక్టులు మేం వాడుకోవచ్చా?’ అనగానే ‘ఎలో’ క్లిక్ చేస్తాం. ‘మీ ఫోన్ కెమెరా యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వండి..’ అన్నా ‘ఎలో’ చేసేస్తాం. ఒకటేమిటి ఐదారు ‘ఎలో’ల తర్వాత గానీ యాప్ ఇన్స్టాల్ కాదు. వేటివేటికి అనుమతిచ్చామన్నది మనకు గుర్తుండదు. అయితే, కనీస అవగాహన లేకుండా ఇన్స్టాల్ చేసుకునే కొన్ని యాప్‌లు మనకు తెలియకుండానే ఫోన్లోని సమాచారాన్నంతా ఊడ్చేస్తుంటాయి. వ్యక్తిగత వివరాలన్నీ ఆన్‌లైన్‌కి అప్పగించి యాప్‌లో విహరిస్తూ ఆనందపడుతుంటారు! అదును చూసి ఆ డేటాతో మాటువేసి వేటు వేస్తారు స్కామర్లు. యాప్ ఇన్స్టలేషన్ సమయంలో మితిమీరిన పర్మిషన్లు అడుగుతున్నవాటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం.
కంట్రోలింగ్ వాళ్ల చేతుల్లో..
☞ సాధారణ లొకేషన్ యాక్సెస్, మెసేజ్ యాక్సెస్ అడిగితే ఫర్వాలేదు. కానీ, తెలిసీ తెలియక మనం ఇచ్చే అనుమతులతో యాప్ ద్వారా మన వ్యక్తిగత సమచారం తస్కరించే ప్రమాదం ఉంది.
☞ కొన్ని యాప్‌లు ఈ అనుమతుల ద్వారా మాల్ వేర్‌ను గానీ వైరస్‌ను గానీ మన ఫోన్లోకి చొప్పించేస్తుంటాయి. అప్పుడు ఫోన్ మన చేతుల్లోనే కనిపించినా.. కంట్రోలింగ్ మాత్రం స్కామర్ల చేతుల్లో ఉంటుంది. డేటాను దొంగలించడంతోనే ఆగరు, మన ఫోన్ కెమెరాతోనే మన వ్యవహారాలనూ గమనిస్తారు. దీనిని సకాలంలో గుర్తించలేకపోతే మరిన్ని దుశ్చర్యలకు పాల్పడతారు.
☞ ఒక్కసారి మన ఫోన్‌ను తమ అదుపులోకి తీసుకున్న తర్వాత.. మన బ్యాంకు వివరాలను సంపాదించడం వాళ్లకు చిటికెలో పని. బ్యాంకు ఖాతాలోని సొమ్ములు కాజేయడం వారికి పెద్ద పనేం కాదు!
☞ అంతేకాదు, ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసి, దానిని తొలగించడానికి డబ్బులు డిమాండ్ చేసేవాళ్లూ ఉంటారు.
☞ కొన్ని యాప్‌లు అనవసరమైన ప్రకటనలతో హోరెత్తిస్తుంటాయి. ప్రకటన పూర్తయ్యే వరకూ యాప్‌ను ఉపయోగించలేని పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని యాప్‌లు మనం ఎక్కడికి వెళ్తున్నామన్నది నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
☞ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్ఏ) ఉండేలా జాగ్రత్తపడాలి.
☞ ఇంటిపేరు, పుట్టినతేదీతో కాకుండా కఠినమైన పాస్వర్డ్ ఎంచుకోవాలి. ఫింగర్‌ప్రింట్, ఫేస్ లాగిన్ డిసేబుల్ చేసుకోవడం మంచిది.
☞ అఫీషియల్ వెబ్సైట్లు, యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి ముందు రివ్యూలు చదవడం అలవాటు చేసుకోండి. యాప్ నిర్వాహకులు, సంస్థకు చెందిన వివరాలు తెలుసుకోండి.
☞ అప్పనంగా వస్తుంది కదా అని, ఫ్రీ పబ్లిక్ వైఫై, వైఫై హాట్‌స్పాట్స్ ఉపయోగించొద్దు.
☞ ఫోన్లో వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఉపయోగించండి. దీనివల్ల ఆ ఫోన్ ద్వారా జరిగే డేటా ట్రాన్స్ఫర్ అంతా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. సెక్యూర్డ్‌గా ఉంటుంది.
☞ అన్నిటికీ గూగుల్ బ్రౌజర్ మీదే ఆధారపడకుండ టార్, బ్రేవ్, డక్‌డక్‌గో వంటి బ్రౌజర్లను ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
☞ https://myaccount.google.com/ privacycheckup మీ గూగుల్ అకౌంట్ ప్రైవసీ చెక్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ సెట్టింగ్స్..
☞ స్క్రీన్‌లాక్: Settings >; Security >; Screen Lock వెళ్లి ఫేస్ ఐడీ గానీ, టచ్ ఐడీ గానీ, పాస్‌కోడ్ గానీ, ప్యాటర్న్ గానీ పకడ్బందీగా ఉండేలా చూసుకోండి.
☞ యాప్ పర్మిషన్: Settings Settings >; Privacy >; Permission Manage ద్వారా సెట్టింగ్స్ పక్కాగా ఉండేలా చూసుకోవచ్చు.
☞ సాఫ్ట్వేర్ ఆటో అప్డేట్: Settings >; General >; Software update ఎనేబుల్ చేయాలి.
☞ ఫైండ్ మై డివైస్: దీన్ని (Settings >; Find My Device) ఎనేబుల్ చేయడం ద్వారా ఫోన్ గానీ పోయినట్లయితే ట్రాక్ చేయొచ్చు.
☞ కెమెరా పర్మిషన్: Settings>; Security & privacy వెళ్లి కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ డిసేబుల్ చేయాలి. వీటి ద్వారా ఫోన్‌కు రక్షణ కల్పించొచ్చు. యాప్‌ల దాడి నుంచి తప్పించుకోవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
Cyber Crime Preventation Tips | సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారా? వెంటనే ఈ పనులు చేయండి!
Cinema Review | సినిమా రివ్యూలు ఇవ్వండి.. డబ్బులు ఇస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా?
Tech Tips | సోషల్‌మీడియాలో మీ పిక్ పెడుతున్నారా? ఇలా చేస్తే బుక్కయినట్టే!
Fake Parcel Scam | విదేశాల నుంచి విలువైన బహుమతులు వస్తున్నాయా? అంత ఈజీగా నమ్మేయకండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

