Safe Browsing | సాంకేతిక ప్రపంచంలో విహరించడం అంటే.. పద్మవ్యూహంలోకి వెళ్లడం ఒక్కటే తెలిసుంటే సరిపోదు. దాన్ని ఛేదించే పరిజ్ఞానమూ ఉండాలి. ఇంటర్నెట్ వినియోగంపై పైపై అవగాహన ఉంటే చాలదు. మన బ్రౌజింగ్‌పై ఎవరి కన్నూ పడకుండా చూసుకోవాలి. అందుకు సరైన ఎంపిక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్). సేఫ్టీ బ్రౌజింగ్‌కు ఇది సహాయకారిగా ఉంటుంది. యూజర్ ఎన్‌క్రిప్షన్‌తోపాటు డేటా ప్రైవసీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ కలిగి ఉండటం వీపీఎన్ బలాలు కాగా, వీటినే అస్ర్తాలుగా మలుచుకుంటున్నారు స్కామర్లు.
ఈరోజుల్లో సంపన్నుల ఆవాసాలు మాత్రమే కాదు మధ్యతరగతి నివాసాలు కూడా వైఫై జోన్లుగా మారిపోయాయి. సాధారణంగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు మోడెమ్ ఫిక్స్ చేస్తారు. దాని నుంచి వైఫై రూటర్‌కు గానీ, కేబుల్ ద్వారా కంప్యూటర్‌కు గానీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. వినియోగదారుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయగానే.. కేబుల్ ద్వారా మోడెమ్‌కు, అక్కణ్నుంచి సర్వర్‌కు రిక్వెస్ట్ పాస్ అవుతుంది. తిరిగి సర్వర్ నుంచి మోడెమ్‌కు, తర్వాత కేబుల్ ద్వారా కంప్యూటర్‌కు సమాచారం చేరి.. బ్రౌజర్లో లింక్ ఓపెన్ అవుతుంది. ఇదంతా క్షణకాలంలో జరిగిపోతుంది. ఈ క్రమంలో ఆ లింకు ఏ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ నుంచి ఓపెన్ చేసిందీ తెలుసుకోవడం సులభం. డేటా ఎన్క్రిప్షన్ ఉండదు కాబట్టి, దానిని ఎవరైనా యాక్సెస్ చేసే అవకాశమూ ఉంటుంది. ఇలా జరగకుండా, ఐపీ అడ్రస్ గోప్యత, డేటా భద్రత కోసం వీపీఎన్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల ఐపీ అడ్రస్‌ను కనుక్కోవడం కష్టమవుతుంది. దీనికితోడు డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది కాబట్టి, ఎవరూ యాక్సెస్ చేసే వీలుండదు.
☞ ఐపీ అడ్రస్ బయటపడకుండా ఇంటర్నెట్ వినియోగించుకునే వెసులుబాటు ఉంది. వీపీఎన్ ఉపయోగిస్తున్న వారు ఎక్కడ ఉన్నారన్నది కనిపెట్టడం కష్టం.
n డేటా ఎన్‌క్రిప్షన్‌తోపాటు కొన్ని సెక్యూరిటీ ప్రొటోకాల్స్ వినియోగదారుడి డేటాకు భద్రత కల్పిస్తాయి. మరెవరూ దానిని యాక్సెస్ చేసే పరిస్థితి ఉండదు. దీనివల్ల సైబర్ దాడుల నుంచి తప్పించుకోవచ్చు.
☞ మన దేశంలో రద్దు చేసిన వెబ్సైట్లను వీపీఎన్ ద్వారా ఇతర దేశాల నుంచి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. వెబ్సైట్లతోపాటు మనదేశంలో అందుబాటులో లేని స్ట్రీమింగ్ సర్వీస్‌లను, ఆన్లైన్ కంటెంట్‌ను పొందే వీలు ఏర్పడుతుంది.
☞ డేటా ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ వల్ల వీపీఎన్ వినియోగంలో ఇంటర్నెట్ వేగం మందగిస్తుంది.
☞ వీపీఎన్ సబ్‌స్క్రిప్షన్‌కు నెలవారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
☞ తమ డేటా భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని ప్రొవైడర్‌ను నమ్మటం తప్ప, ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో చెప్పలేం. అంతేకాదు, కొందరు ప్రొవైడర్లు యూజర్ బ్యాండ్‌ను థర్డ్ పార్టీకి అమ్ముకునే ప్రమాదమూ ఉంది.
☞ వీపీఎన్ ద్వారా కంప్యూటర్లో ఇబ్బందికర సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ అయ్యే ప్రమాదం ఉంది. మాల్వేర్స్ తొలగించడానికి డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు కూడా!
☞ వినియోగదారుల ప్రైవసీ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వచ్చిన వీపీఎన్ టెక్నాలజీ.. స్కామర్లకు స్వర్గధామంగా మారింది. దీనిసాయంతో ప్రతిష్ఠాత్మక సంస్థలకు సంబంధించి ఫేక్ వెబ్సైట్లు రూపొందించి, ఈ-మెయిల్స్ పంపుతూ బురిడీ కొట్టిస్తారు.
☞ ఫిషింగ్ సందేశాలతోపాటు ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లు ఎరచూపి అమాయకులకు కుచ్చుటోపీ పెడతారు.
☞ వీపీఎన్ టెక్నాలజీతో లొకేషన్ ట్రేస్ చేయడం కష్టం కావడంతో దీనిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు స్కామర్లు. ఇంటర్నెట్ వినియోగదారులకు కొన్ని లింక్స్ పంపి, వాటిని యాక్సెస్ చేసిన వ్యక్తుల కంప్యూటర్లను వాళ్ల అధీనంలోకి తీసుకొని వ్యక్తిగత సమాచారం కొల్లగొడతారు.
☞ కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారం, చిత్రాలు దొంగిలించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారు. వారు డిమాండ్లకు తలొగ్గకపోతే ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటారు.
☞ నమ్మకమైన సంస్థ నుంచి వీపీఎన్ సదుపాయం తీసుకోవాలి.
☞ పాస్వర్డ్లు కఠినంగా ఉండేలా చూసుకోవాలి. అతి సులువైనవి, ఊహించడానికి అనువైనవి వద్దు.
☞ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలి.
☞ పబ్లిక్ వైఫైని ఉపయోగించొద్దు.
☞ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్వేర్లు అప్ టు డేట్ ఉండేలా చూసుకోవాలి.
Scam
వీపీఎన్ వినియోగంపై భారత ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని మార్గ నిర్దేశకాలను జారీ చేసింది. వ్యక్తిగతంగా వాడుతున్నా, సంస్థాగతంగా వినియోగిస్తున్నా ఈ నియమాలు వర్తిస్తాయి.
వీపీఎన్ ప్రొవైడర్లు రిజిస్టర్ చేసుకోవాలి.
☞ న్యాయబద్ధం కాని సమాచారాన్ని యాక్సెస్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
☞ వీపీఎన్ వినియోగదారుల సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్ నుంచి తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. వినియోగదారుల పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు ప్రభుత్వం అడిగితే వీపీఎన్ ప్రొవైడర్ ఇవ్వాల్సిందే!
☞ సర్వీస్ ఎప్పుడు తీసుకున్నది, ఐపీ అడ్రస్, వీపీఎన్ సర్వీస్ ఎందుకోసం తీసుకున్నాడన్న వివరాలు అధికారులు అడిగినప్పుడు సర్వీస్ ప్రొవైడర్లు నిరాకరించొద్దు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Online Abuse | అశ్లీల చెర నుంచి మీ పిల్లలను ఇలా కాపాడుకోండి
Fishing | అందమైన అమ్మాయిలు క్లోజ్‌గా మాట్లాడుకుందాం రమ్మని లింకులు పంపిస్తున్నారా?