కంఫర్ట్‌గా ఉండటంతో ఆడామగా తేడా లేకుండా స్కూటీలు వాడేస్తున్నారు. అందులోనే మరింత సౌకర్యాన్ని అందించేలా బెంగళూరుకు చెందిన రివర్ సంస్థ ‘ఇండీ’ పేరిట సరికొత్త స్కూటర్‌ను తీసుకువచ్చింది. రైడింగ్‌ను సులభతరం చేస్తూ భారత్‌లోనే తొలిసారి దీనికోసం 14 అంగుళాల టైర్లను రూపొందించింది. స్కూటర్ సీటు కింద స్టోరేజీని 43 లీటర్ల కెపాసిటీతో డిజైన్ చేశారు. ముందువైపు 12 లీటర్ల సామర్థ్యంతో ఓ బాక్సు ఇమిడ్చారు. రోడ్డు మరింత స్పష్టంగా కనిపించేలా లైట్లు చేస్తాయి. ఈ రకం స్కూటర్లు ఎరుపు, పసుపు, నీలం.. తదితర రంగుల్లో వస్తున్నాయి. ఐదుగంటల్లో 80 శాతం ఛార్జ్ అయ్యే ఈ బైక్.. ఒకసారి ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 1.25 లక్షల రూపాయల ఖరీదు చేసే ఈ బైక్‌ను rideriver.com వెబ్సైట్ ద్వారా ప్రీ ఆర్డర్ చేయవచ్చు. పర్యావరణానికి ఎంతోకొంత మంచి చేయవచ్చు.
Bag
కంప్యూటర్లు మన వెంట తిరగడం ప్రారంభమైనప్పటి నుంచీ ఆఫీసుకు వెళ్లినా, ఊళ్లకు వెళ్లినా వీపున ఒక సంచి వేలాడటం మొదలైంది. ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి అనువుగా మెత్తటి కుషన్ ఉండటమే దీని ప్రత్యేకత. బ్యాక్‌ప్యాక్‌లా ఉపయోగపడుతూనే, చిన్నచిన్న ప్రయాణాల్లో సాధారణ బ్యాగ్‌గానూ మారిపోతుంది. ఈ కన్వర్టబుల్ బ్రీఫ్ప్యాక్లో ఫైల్స్‌తోపాటు ల్యాప్‌టాప్, ఐప్యాడ్, హెడ్‌ఫోన్స్.. ఇలా రకరకాల గ్యాడ్జెట్లు పెట్టుకునేందుకు అనేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి చేత్తో పట్టుకునే బ్యాగ్‌గానూ, బ్యాక్ప్యాక్గానూ వాడుకోవచ్చు. రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లతో దీన్ని తయారుచేశారు. dailyobjects.com వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. ధర మాత్రం రూ.4,999.
Videogame Screen
కదలకుండా సీట్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నవారికి వ్యాయామం మరింత అవసరం. కానీ, చాలామంది జిమ్‌కు వెళ్లేందుకు బద్ధకిస్తూ ఉంటారు. అలాంటివారు శ్రమ తెలియకుండానే వర్కవుట్ చేసేందుకు తయారు చేసిందే.. ప్లేపల్స్ గేమింగ్ బైక్. దీనికి ఉండే 24 అంగుళాల టచ్‌స్క్రీన్, గేమింగ్ హ్యాండిల్స్ మనం గేమ్స్ ఆడుకోవడానికి సహకరిస్తాయి. అలాగే, కింద ఉండే పెడల్స్ తొక్కుతూ సైక్లింగ్ కూడా చేయవచ్చు. ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోగలిగేలా కూడా రూపొందించారు. దీంతో సినిమాలూ వీక్షించవచ్చు. అయితే పెడల్ తొక్కడం ఆపేసి స్క్రీన్ చూస్తామంటే మాత్రం కుదరదు. గేమ్ ఆడినా, సినిమా చూసినా పెడల్స్ కదులుతూనే ఉండాలన్నమాట. సరదా సరదాగా వ్యాయామం చేయించే ఈ గేమింగ్ బైక్‌ను playpulse.comలో ఖరీదు చేయవచ్చు. ధర రూ.1.32 లక్షలు.
Sheo
అడిడాస్ సంస్థ తేలికపాటి బూట్లను మార్కెట్లోకి తెచ్చింది. ‘అడిడాస్ అల్ట్రా బూస్ట్ లైట్’ షూస్ మిగతా వాటికంటే 30 శాతం తక్కువ బరువు ఉంటాయి. రన్నింగ్ చేసేవారికి పనికొచ్చేలా మెత్తని కుషన్‌తో వీటిని తయారు చేశారు. అంతేకాదు, కాళ్లకు బాగా గాలి ఆడేలా ప్రత్యేకమైన అల్లిక ఉంటుంది. ఎక్కువ గ్రిప్ ఉండేలా ప్రత్యేక రబ్బర్‌తో రూపొందించారు. adidas.co.in వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 18,999.
“Naya Mall | ఈ పెన్ను ధర రూ.22.74 లక్షలు.. అంతలా దీని స్పెషాలిటీ ఏంటో !!”
“Naya Mall | కళ్ల కింద చారలతో వయసు పైబడినట్టు కనిపిస్తున్నారా? మీకోసమే ఈ ట్రిక్”