బ్యాగుల్లో తోపు కంపెనీ.. లూయిస్ విట్టన్ బ్రాండ్ ప్రియులకు పరిచయమే. ఫ్యాషనబుల్ లగ్జరీ హ్యాండ్ బ్యాగుల్ని రూపొందించే ఈ సంస్థ లగేజీ బ్యాగులనూ తయారు చేస్తున్నది. ఈ కోవలోనే ‘వర్గిల్ అబ్లో ఎవ్రీడే ఎల్వీ క్యాప్సూల్’ పేరిట కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పసుపు పచ్చ, తెలుపు రంగుల లెదర్‌తో రూపొందించిన దీనికి ఎసిటేట్ గొలుసును హ్యాండిల్లా ఇచ్చారు. ఇది కాక క్రాస్ బాడీ వేసుకునేందుకు వీలుగా లెదర్ స్ట్రాప్నూ జత చేశారు. వస్తువుల భద్రత కోసం లాక్ సిస్టమ్‌తో వచ్చే ఈ బ్యాగుకు మన వివరాలు రాసి పెట్టుకునే టాగ్ కూడా ఉంది. ఖరీదు మాత్రం రెండు లక్షల నలభై వేల రూపాయలు. 24s.com వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు.
మిషన్ మీద కుట్టారా, శిల్పంలా చెక్కారా… అనిపించేంత అందంగా ఉంటాయి కొన్ని డ్రెస్‌లు. అందులోనూ, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ‘హిరణ్య గర్భ’ కలెక్షన్నూ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఈ సిరీస్‌లో అన్ని దుస్తులూ విభిన్నంగా మలిచినవే అయినా.. సంపెంగ పువ్వు రంగులో అమ్మాయి ఒంటికి తీగలా అల్లుకుపోయిన డ్రెస్ మాత్రం మరింత ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నది. కాలి దగ్గర వచ్చిన స్లిట్, తల మీదుగా వచ్చిన మేలి ముసుగు ప్రత్యేక సొబగుల్ని అద్దుతున్నాయి. ఇటీవలి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన ఈ డ్రెస్ ఖరీదు, మరిన్ని వివరాలు తెలుసుకునే ఆసక్తి ఉంటే.. gauravguptastudio.com క్లిక్ చేయవచ్చు.
క్రాక్స్… యువత ఇష్టంగా ధరించే విభిన్నమైన పాదరక్షలు. కాస్త ఖరీదే అయినా కాలికి సౌకర్యంగా ఉండటం, చూసేందుకు ఫ్యాషనబుల్‌గా కనిపించడంతో చాలా మంది వీటికి ఓటేస్తున్నారు. అలాంటి వాటిలో ఒక రకమే డైలాన్ క్లాగ్ చెప్పులు. కాలికి మెత్తగా ఉంటూనే.. సూక్ష్మక్రిముల బారి నుంచి కాళ్లను కాపాడే క్రాస్లైట్ మెటీరియల్‌తో వీటిని తయారు చేశారు. లోతుగా ఉండే అడుగు భాగం పాదాన్ని చక్కగా పట్టి ఉంచుతుంది. ఏమాత్రం మురికి పట్టినా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవచ్చు కూడా. అచ్చమైన లెదర్లా కనిపించడం వీటి ప్రత్యేకత. crocs.in వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ధర రూ. 5,495 మాత్రమే.
Watch
ఎరుపు రంగు ఎప్పుడూ హాటే. అదే వర్ణంలో ఫ్యాషనబుల్ లుక్‌లో వాచీలు, నగల తయారీ సంస్థ స్విస్ ఓ చేతి గడియారాన్ని తీసుకువచ్చింది. ‘రెడ్ జ్యూసీ’ దీనిపేరు. వాచ్ లోపలి భాగాలు కనిపించేలా ఓపెన్ డయల్ తరహాలో రూపొందించారు. వాచ్కేస్ రఫ్‌గా కనిపించేలా శాండ్‌బ్లాస్ట్ మోడల్‌ను ఎంచుకున్నారు. అంటే ఒక పీడనం కలిగిన ప్రాంతంలో ఇసుక రేణువుల్ని ఉంచి ఈ డయల్ కేస్కి బలంగా తాకించడం ద్వారా వచ్చే లుక్ అన్నమాట. చీకట్లోనూ టైం చూసుకునేందుకు వీలుగా గ్లో ఇన్ డార్క్ మెటీరియల్‌తో వాచీ ముళ్లను రూపొందించారు. ఓవర్సైజ్డ్ డయల్‌తో వచ్చే ఈ వాచీ ధర పదహారు వేల రూపాయలు. swatch.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”