అంటాననారివో : (Nano-chameleon) అంగుళం కంటే చిన్న ఊసరవెల్లిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న సరీసృపంగా పేర్కొంటున్నారు. ఈ బుల్లి ఊసరవెల్లికి ‘నానో కెమిలియాన్’ అని పేరు పెట్టారు. ఉత్తర మడగాస్కర్‌లోని అడవిలో జర్మనీ, మడగాస్కర్కు చెందిన పరిశోధకుల బృందం ఈ అతిచిన్న ఊసరవెల్లిని కనుగొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 11,500 సరీసృపాలను కనుగొనగా, వీటిలో నానో-ఊసరవెల్లి అతి చిన్నది కావడం విశేషం. శాస్త్రవేత్తలు రెండు మగ, రెండు ఆడ ఊసరవెల్లులను కనుగొన్నారు. మగ ఊసరవెల్లి ఆడదాని కంటే చిన్నదిగా ఉంటుంది. మగ ఊసరవెల్లి పరిమాణం 0.53 అంగుళాలుగా ఉండగా, ఆడదాని పరిమాణం 0.75 అంగుళాలు.
మడగాస్కర్ అడవి వీటి నివాసమని జర్మనీకి చెందిన నేచురల్ హిస్టరీ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్త ఆలివర్ హోలిస్చెక్ తెలిపారు. మడగాస్కర్ అడవి నానో-ఊసరవెల్లలకు నిలయం. నానో ఊసరవెల్లి పునరుత్పత్తి అవయవం దాని శరీరంలో 20 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, కొన్ని జీవుల్లో పునరుత్పత్తి అవయవాలు వాటి శరీరం కన్నా పెద్దవిగా ఉంటాయని, ఈ బుల్లి ఊసరవెల్లి కూడా అలాంటి కోవకు చెందినదే అని హోలిస్చెక్ వెల్లడించారు.
Is this the world’s smallest reptile? Scientists discovered a new nano-chameleon that’s sunflower seed-sized in northern Madagascar https://t.co/TWL92pAnFa pic.twitter.com/skcpBQuJ2A
— Reuters (@Reuters) February 5, 2021
రామ్‌దేవ్ బాబాకు ఢిల్లీ కోర్టు సమన్లు
బ్రిటన్‌లో కొత్త ఫుడ్ ట్రెండ్ 5 : 2 .. వెజిటేరియన్ వైపు మొగ్గు
పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా చేయూత.. 300 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఇంకా 450 మంది అమెరికన్లు.. పెంటగాన్ వెల్లడి
పంజాబ్ రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా కెప్టెన్
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..