petrol rates | అతనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. తన మేథస్సుతో బ్యాటరీ సైకిల్‌ను తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ పెట్టుకుంటే చాలు.. నలభై కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. వెంగళరావు నగర్ కాలనీకి చెందిన యువకుడు అబ్దుల్ ఆసిమ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మాసాబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని తమ కార్యాలయానికి వెళ్లి రావడానికి రోజుకు వంద రూపాయల పెట్రోల్‌ను స్కూటీలో పోసి నడిపేవారాయన. అలా రోజుకు వంద రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం.. డబ్బు దుబారాతో పాటు.. ఆ స్కూటీ నుంచి వెలువడే కాలుష్యం పర్యావరణానికి హాని చేస్తుందని మదనపడ్డాడు.ఆ ఆలోచన నుంచే బ్యాటరీ సైకిల్ రూపొందింది. ఇప్పుడు డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది.
ఇంట్లోని పాతసైకిల్ను బయటకు తీశారు. ఈ సైకిల్‌కు 250 వాట్స్ బి.ఎల్.డీ.సీ. మోటారు, 18 ఏ.హెచ్. వోల్టుల రెండు బ్యాటరీలు, ఎక్స్‌లేటర్, లైట్, హారన్, విడిభాగాలను రూ.6,500 తో కొనుగోలు చేసి అమర్చారు. డబ్బెక్కువ ఖర్చు చేయడం ఇష్టపడని ఆసిమ్ సెకండ్ హ్యాండ్ బ్యాటరీని కొనుగోలు చేశారు. సైకిల్‌కు వెనుకభాగంలో బ్యాటరీని అమర్చారు. ఆ బ్యాటరీతో రోడ్లపై సైకిల్‌ను పరుగెత్తిస్తున్నాడు. 30 కిలోమీటర్ల వేగంతో బ్యాటరీ సైకిల్ ప్రయాణిస్తుందని.. తక్కువ వేగంతో వెళ్తుండటంతో.. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళ బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోతే.. సైకిల్ పెడల్పై కాళ్లతో చక్కగా తొక్కుకుంటూ ప్రయాణించవచ్చు.
సైకిల్‌కు ఉన్న రెండు బ్యాటరీలకు చార్జింగ్ పెట్టడానికి..రోజుకు ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. చార్జింగ్ కావడానికి రోజుకు సుమారు రూ.5లు ఖర్చవుతుంది. అప్పుడు రోజుకు రూ.100లు పెట్రోల్ కోసం ఖర్చు చేయాల్సి రాగా.. ఇప్పుడు కేవలం రూ.5ల ఖర్చుతోనే ఆఫీసుకు వెళ్లి రావొచ్చని చెప్తున్నారు ఈ యువ ఇంజినీర్ ఆసిమ్. తమ కాలనీలో ఉండే మిత్రుడు ప్రముఖ సైంటిస్ట్ రఘునందన్ సలహాలతో ఈ బ్యాటరీసైకిల్ తయారు చేశానని చెప్పారు.
రోజు రోజుకు నగరంలో కాలుష్యం పెరిగిపోతుంది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పెరిగిన పెట్రోల్ ధరల ( petrol rates )తో సామాన్యుడికి భారం పడుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు సాయంగా బ్యాటరీ సైకిల్ కావాలన్న వారికి తయారీలో సాయం అందిస్తా.. బ్యాటరీ సైకిల్ వినియోగించడం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారిమవుతాం. సలహాల కోసం 95731 87195 ను సంప్రదించవచ్చు.
– అబ్దుల్ ఆసిమ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Electric Vehicles | పెట్రో ధరల ఎఫెక్ట్.. ఈ- వెహికిల్స్‌కే హైదరాబాదీల ఇంట్రెస్ట్
విపణిలోకి నెక్స్‌జూ ఎలక్ట్రిక్ సైకిల్.. 100 కి.మీ కెపాసిటీ!
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ఓసారి లుక్కేయండి!