హైదరాబాద్, జూలై : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వాటిలో పెట్రోల్ ఇంజన్ తోపాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లనే ఎక్కువగా కొనేందుకు కష్టమర్లు ఇష్టపడుతున్నారు. సీఎన్జీ ఇంధనం తక్కువ ధరకు లభించడమే కాకుండా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే అధిక మైలేజీ కూడా ఇస్తాయి. సీఎన్జీ తో నడిచే కార్లలో ఉత్తమమైనవి ఇప్పుడు చూద్దాం..
మారుతి సుజుకీ వ్యాగన్ఆర్…
మారుతి సుజుకి నుంచి అత్యంత పాపులర్ అయిన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కూడా పెట్రోల్‌తో పాటుగా సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో లభిస్తుంది. మార్కెట్లో ఈ కారు సిఎన్జి వేరియంట్ల ధరలు రూ.5.60 లక్షల నుంచి రూ.5.67 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ కారు కేజీ సిఎన్‌జికి 32.52 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో లభించే స్టాండర్డ్ ఫీచర్లలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసి, నాలుగు పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో…
మారుతి సుజుకీ ఇండియా కు చెందిన మరొక సిఎన్జి కారు ఎస్-ప్రెస్సో. కొత్తగా వచ్చి చేరిన మోడల్ ఇది. ఈ కారు పెట్రోల్‌తో పాటుగా సిఎన్జి ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉన్నది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 1కిలో సిఎన్‌జితో 31.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి ఎస్-ప్రెస్సో ఆల్టో కంటే కాస్తంత పెద్దగా, స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు చూడటానికి మైక్రో ఎస్యూవీ మాదిరిగా అనిపిస్తుంది. ఈ మోడల్లో నాలుగు సిఎన్జి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ.4.96 లక్షల నుంచి రూ.5.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకీ సెలెరియో…
మారుతి సుజుకి నుండి లభిస్తున్న మూడవ ఎంట్రీ లెవల్ సిఎన్జి కారు ఈ సెలెరియో. మారుతి సుజుకి సెలెరియో పైన పేర్కొన్న రెండు హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని సిఎన్జ వెర్షన్ కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. మారుతి సెలెరియో సిఎన్జి వేరియంట్లో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి ధరలు రూ.5.84 లక్షల నుంచి రూ.5.90 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్)లో ఉంటాయి. ఇందులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసి, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, సింగిల్ ఎయిర్‌బ్యాగ్, ఏబిఎస్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.
హ్యుందాయ్ శాంత్రో…
హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ శాంత్రోలో కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్‌ను అందిస్తున్నది. ఈ కారు కేజీకి 30 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. హ్యుందాయ్ శాంత్రో సిఎన్జి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో ధరలు రూ.5.92 లక్షల నుంచి రూ.6.06 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ కారులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను, ఆపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో,రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి సుజుకీ ఆల్టో 800…
మారుతి సుజుకి ఆల్టో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు. కంపెనీ ఈ కారును పెట్రోల్ ఇంజన్‌తో పాటు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్‌తో కూడా విక్రయిస్తున్నది. ఈ చిన్న కారు 1 కిలో సిఎన్‌జితో 31.59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో 800 ఎస్-సిఎన్జి ధరలు రూ.4.56 లక్షల నుంచి రూ.4.60 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. మారుతి ఆల్టో సిఎన్‌జిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, కీలెస్ ఎంట్రీ, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.