సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా అగ్ర నిర్మాత దిల్‌రాజు హిందీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది. శనివారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబయిలో మొదలైంది. సల్మాన్‌ఖాన్‌తో పాటు కథానాయిక నయనతార సెట్స్‌లో జాయిన్ అయ్యారు. నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో హై ఇంటెన్స్ యాక్షన్ ఘట్టాలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. బలమైన భావోద్వేగాలు కలబోసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, రచన-దర్శకత్వం: వంశీ పైడిపల్లి.