న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో మాడల్‌కు గుడ్‌బై పలుకబోతున్నది. ఇగ్నిస్ మాడల్‌ను డిస్కంటిన్యూ చేసే ఆలోచనలో సంస్థ ఉన్నట్టు సమాచారం. దీని స్థానంలో టాటాకు చెందిన మైక్రో ఎస్యూవీ మాడల్ పంచ్‌కు పోటీగా మరో మాడల్‌ను విడుదల చేయానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇగ్నిస్‌కు కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నది.