SBI Scholorships | ఉపకార వేతనాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (CSR) కింద ఎస్బీ ఫౌండేషన్ ఈ ఉపకార వేతనాలను 25,000 మంది విద్యార్థులకు అందించనున్నది. ఇందుకు సంబంధించిన ‘ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్-2026’ విడుదలచేసింది. ఈ ఏడాది రూ. 100 కోట్ల ఉపకార వేతనాలను విద్యార్థులకు ఇవ్వనుంది.
రూ. 15 వేల నుంచి రూ. 15 లక్షల వరకు
ఉపకార వేతనాలను రూ. 15,000 నుంచి రూ. 15 లక్షల వరకు ఇవ్వనున్నారు. ప్రతిభ కలిగి, ఆర్థిక స్తోమతలేని (Economally Backward) విద్యార్థులు ఈ ఉపకాతర వేతనాలతో తమ చదువును పూర్తి చేయవచ్చు.
అర్హతలు
9వ తరగతి నుంచి మొదలుకొని డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, ఐఐటీ, ఐఐఎం, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత విద్యాసంవత్సరంలో 75 శాతం మార్కులు లేదా 7.5 శాతం సీజీపీఏ సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ. 3 లక్షలు, కాలేజీ విద్యార్థులకు రూ. 6 లక్షల్లోపు ఉండాలి.
చివరితేదీ
ఈ ఉపకారవేతనాలకు సెప్టెంబర్ 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు వెబ్సైట్ www.sbiashascholarship.co.in లో చేసుకోవాలి.