సోమవారం 18 జనవరి 2021
Science-technology - Nov 26, 2020 , 17:47:00

త్వరలో... మార్కెట్ లోకి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160

 త్వరలో... మార్కెట్ లోకి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160

ముంబై :భారతదేశంలో నూతన ప్రీమియం స్కూటర్‌ను ఆవిష్కరించేందుకు పియాజ్జియో ఇండియా సిద్ధమైంది. త్వరలోనే తమ బారామతి కర్మాగారంలో తమ "ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 "ను  ప్రవేశ పెట్టనున్నది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160ను మొట్టమొదటిసారిగా గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించారు. ఆటో ఎక్స్‌పో వద్ద అత్యున్నత ప్రశంసలు పొందిన స్కూటర్‌గా ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 తొలిసారిగా   పనితీరుతోపాటు న్యూ స్టయిల్ తో వస్తుంది. వాహన ప్రియుల కోసం ఇటలీ లో డిజైన్‌ చేయసిన ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఇప్పుడు నూతన బెంచ్‌మార్క్‌ను తమ వినూత్నమైన రేపటి తరాన్ని ఆకట్టుకునేలా, అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు.

 ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 16... 

 ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ఇప్పుడు ప్రీమియం స్కూటర్‌ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ ను సృష్టించనుంది. దీనిలో అత్యున్నత పనితీరు కలిగిన160సీసీ బీఎస్‌ 6, మూడు వాల్వ్‌ల ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ స్వచ్ఛమైన ఉద్గారాల ఇంజిన్‌ సాంకేతికత ఉంది. ఇది అత్యున్నత శక్తి, టార్క్‌ను అసాధారణ రైడింగ్ అనుభవాలను అందిస్తుంది.

3 కోట్‌ హెచ్‌డీ బాడీ పెయింట్‌ ఫినీష్‌ ,  ఏప్రిలియా సిగ్నేచర్‌ గ్రాఫిక్స్‌ను మాట్‌ బ్లాక్‌ డిజైన్‌ ట్రిమ్స్‌తో జత కలుపుతుంది. అదే సమయంలో డార్క్‌ క్రోమ్‌ ఎలిమెంట్స్‌ కూడా జోడించారు.  షార్ప్ బాడీ లైన్స్‌, జామ్రెటిక్‌ కాంటూర్స్‌, అత్యున్నత పనితనం వంటివి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 శక్తివంతమైన ప్రీమియం అప్పీల్‌ ను అందిస్తుంది. వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టెక్నాలజీ ట్విన్‌ క్రిస్టల్‌ హెడ్‌లైట్స్‌ , ఐ లైన్‌ పొజిషన్‌ లైట్స్‌ వంటివి ఫ్రంట్‌ ఇండికేటర్‌ బ్లింకర్స్‌తో  కలిసిపోవడంతో పాటు దీని వినూత్నమైన లైట్‌ ప్లే సృష్టిస్తాయి.

ఇంటిగ్రేటెడ్‌ వెనుక బ్లింకర్స్‌ తో డైమండ్‌ రిఫ్లెక్షన్‌ వ్రాప్‌ ఎరౌండ్‌ ఎల్‌ఈడీ టైల్‌ లైట్లు అవసరమైన నూతన తరపు అప్పీల్‌ను అందిస్తాయి.‘‘అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, వినూత్నమైన ప్రీమియం  స్కూటర్ ను మా  వినియోగదారుల కోసం అందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆటో ఎక్స్‌పో 2020 వద్ద వాగ్ధానం చేసినట్లుగా,  ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ని భారతదేశంలో చేయబోతున్నాం" అని పియాజ్జియో ఇండియా ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డియాగో గ్రాఫీ అన్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.