ముంబై ,జూలై :జపాన్ కు చెందిన కార్ బ్రాండ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో సరికొత్తగా “అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ” వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. న్యూ 2021హోండా అమేజ్ సెడాన్‌ను ఆగస్టు 17న ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు హోండా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే హోండా డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్స్ మొదలయ్యాయి.