మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 19, 2020 , 02:45:29

పాండవుల చెరువుకు జలకళ

పాండవుల చెరువుకు జలకళ

గజ్వేల్‌ అర్బన్‌ : పట్టణంలోని పాండవుల చెరువు జలకళ సంతరించుకుంది.  నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి పాండవుల చెరువులో నీటి మట్టం పెరిగింది. గజ్వేల్‌ పట్టణం విస్తరించడంతో చెరువులోకి చేరే నీటి మార్గాలు లేకుండా పోయాయి. సంగుపల్లి వద్ద చేగుంట మార్గంలోని ఫీడర్‌ చానల్‌ ద్వారా మాత్రమే ప్రస్తుతం చెరువులోకి నీరు చేరే అవకాశం ఉంది. అయినా నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి పాండవుల చెరువులోకి 75శాతం నీరు చేరింది. ఇలాగే వర్షాలు కురుస్తే పాండవుల చెరువు మత్తడి దూకే అవకాశం ఉందని మంగళవారం ఇరిగేషన్‌ ఏఈ గురుప్రసాద్‌ వివరించారు.


logo