మర్పల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రెండు కండ్లల ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీపీ లలితారమేశ్, జడ్పీటీసీ మధుకర్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, అదేవిధం గా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించాయని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండటంతో అన్ని వర్గాల వారు సంతోషిస్తున్నారని అన్నారు.
అంతకుముందు జడ్పీటీసీ మాట్లాడుతూ మార్కెట్ కమాన్ నుంచి రస్తా వరకు రోడ్డు గతుకులమయంగా మారిందని, దాని మరమ్మతుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసీయుద్ధీన్, ఎంపీటీసీ సంగీతావసంత్, తహసీల్దార్ తులసీరామ్, ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు సొహైల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు గఫార్, మాజీ పీఏసీఎస్ చైర్మ న్ ప్రభాకర్‌గుప్తా, రమేశ్వర్, అశోక్, మధుకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.