కులకచర్ల, జూన్ 2 : ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం కులకచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో భాస్కర్‌గౌడ్‌ను జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిల చేతుల మీదుగా ఆయన ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉత్తమ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింతగా పెంచిందని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.